అంశం: నిశి రాతిరి
గమ్యం మరువకు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: రాధ ఓడూరి
నిశి రాతిరి వేళ పయనమా
అయితే నేమి…!?
ఆత్మస్థైర్యంతో
కాంతి దారులు వెలిగించు
మనసుతో
గెలుపు దారులు వెతుకు
ఓరిమితో
కారు చీకట్లనే కష్టాలు
సాలె పురుగువలె చుట్టినా
అది అల్లిన గూడు గుర్తు తెచ్చుకో
విజయాన్ని దొరకబుచ్చుకునే వరకు
అప్పుడే…!
అంధకారమైనా వెలుగు రేెఖలు పంచుతుంది
Nice Madam.
బాగా వ్రాసారు