ప్రభాతానికి స్వాగతం

అంశం:నిశి రాతిరి

ప్రభాతానికి స్వాగతం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నాగమణి

నిత్య కృత్యాలకు, విరామమిచ్చిన వేళ,
బడలిన గాత్రాలకు, విశ్రాంతినిచ్చేవేళ,
ఆకాశాన మెరిసే తారకలు,కాంతులను
లోకానికి చూపించ గలిగే వేళ,
ఆక్రోశిస్తున్న మనసులకు, ఉపశమనం
దొరకక, అలమటించే వేళ,
ఈ ఆకలి పొద్దు రేపుండొద్దని, ఆశలు
కలలుగ,కనుపాపలను కౌగలిస్తున్న వేళ,
భావాలకు రెక్కలొచ్చి,అక్షరాలై
రూపుదిద్దుకుంటున్న వేళ,
బానిసత్వపు సంకెళ్లు తెంచి,
స్వేచ్ఛను జాతికి, ఇచ్చిన వేళ,
వైవిధ్యాలెన్నున్నా, ఎన్నింటినో,
ఎన్నెన్నింటినో కలిగిన వేళ,
రేపటి ప్రభాతాన్ని స్వాగతించేదే,
ఈ నిశి రాతిరి వేళ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!