మరచిపోలేని బహుమతి

(అంశం:: “నా ప్రేమ కథ”)

మరచిపోలేని బహుమతి

రచన:చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri“బావా..!ఎలా ఉన్నావ్.”అంది జూనియర్ డాక్టర్ మునీలా.”బావున్నా మునీలా.నువ్వెలా ఉన్నావ్.ఎప్పుడు కలుద్దాం”అన్నాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీహరి.బావా మరదళ్ళు ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటారు.అయినా ఒకరికొకరు తెలియనట్లుగానే ప్రవర్తిస్తూ ఉంటారు.మునీలా జూనియర్ డాక్టర్ గా పనిచేసే ఆసుపత్రి కి పక్కనే శ్రీహరి పని చేసే కంపెనీ కావడంతో అప్పుడప్పుడూ కలుస్తుంటారు కూడా.ఇరువురి మనసులు కలిసినా పెదవి దాటని మాటలు వారి ప్రేమతో దాగుడు మూతలాడుతున్నాయి.
మునీలా డ్యూటీలో ఉండగా ఫోనొచ్చింది ఫోన్లో ఎవరో కాదు మునీలా అమ్మ వాణిశ్రీ “మునీలా..ఎలా ఉన్నావమ్మా అని క్షేమ సమాచారాలయ్యాక వారం తర్వాత మీ పెదనాన్న కొడుకు అదే మీ పెద్దన్న పెళ్ళి నువ్వు ముందే సెలవులు పెట్టుకొని రా “అని చెప్పింది.మునీలాకి ఆసుపత్రి రూంలో ఉంటే చాలా స్వేచ్ఛగా ఉంది ఎందుకంటే శ్రీహరితో రోజూ బజారు తిరిగి సంతోషంగా రూంమేట్స్ తో ఉంటుంది.పెళ్ళికి తప్పకుండా ఓ వారం సెలవు పెట్టాలి.బావని కలవకుండా ఎలా ఉండాలబ్బా అనుకుంటుండగా శ్రీహరి ఫోన్ చేశాడు. “హలో..మునీలా నీకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను వచ్చే వారం బంధువుల పెళ్ళికెళ్తున్నా “అన్నాడు.మునీలా “అవునా…నాకేం బ్యాడ్ న్యూస్ కాదు .నేను హ్యాపీగా ఉంటాలే.నువ్వెళ్ళు”అనడంతో “అంటే..నేను లేకపోయినా నువ్వు ఉండగలవన్నమాట.”అన్నాడు శ్రీహరి.”అవును నువ్వు నన్ను వదిలి వెళ్తున్నప్పుడు నేను ఉండలేనా అంటూ మీ బంధువులయితే నాకూ బంధువులే కదా పెళ్ళెవరిదో కాదు మా పెద్దన్న సురేష్ ది.”అంది మునీలా.”అవునా అక్కడ కలుద్దాం అయితే అన్నాడు.కానీ మునీలా ఆట పట్టిద్దామని “నేను రావట్లేదు బావా నాకు ఇక్కడ కేసులు ఎక్కువయ్యాయి”అనడంతో శ్రీహరి “ఓయ్..రా మునీలా” అంటూ బతిమాలాడు.
“సరే నువ్వు రమ్మంటున్నావని వస్తున్నా.నాకేదైనా గిఫ్ట్ ఇవ్వాలి “అని అడగడంతో శ్రీహరి “నేను నువ్వు మరిచిపోలేని బహుమతి ఇస్తా.మరి నువ్వేమిస్తావ్”అన్నాడు.”నేనూ మరిచిపోలేని బహుమతినే తిరిగి ఇస్తాలే”అంటూ గిల్లికజ్జాలాడారు.
వారం గడిచాక మునీలా ఇంటికెళ్ళిపోయింది.శ్రీహరి కూడా ఊరెళ్ళిపోయాడు.కానీ ఎలాగైనా మునీలాని కలవాలనుకున్నాడు.
రాత్రయింది నేరుగా మునీలా ఇంటికెళ్ళి అరటిగెలను కింద పెట్టి మా నాన్న ఇచ్చి రమ్మన్నాడు అన్నాడు శ్రీహరి.మునీలా శ్రీహరిని చూసి ఎందుకొచ్చావ్ అని సైగ చేసింది.నీకోసమే నిన్ను చూడడానికి అంటూ సైగ చేశాడు.ఈలోపు మునీలా రెడీ అవుతూ ఉంది. మునీలా నాన్న రామకృష్ణ వచ్చి “ఎవరు నువ్వు .ఎవరిల్లు అనుకున్నావ్” అన్నాడు.శ్రీహరి జంకుగా”నేను రామచంద్రాపురం రమణయ్య కొడుకుని ఇది శివకిష్టయ్య ఇల్లే కదా అన్నాడు తెలియనట్లుగా.”ఓరోరి రమణయ్య కొడుకివా మీ నాయనా నేనూ ఒకే క్లాసురా.ఇది శివకిష్టయ్య ఇల్లుకాదు పక్కిల్లే వాళ్ళది.ఆయన మా అన్న అంటూ మునీలా నీళ్ళు తీసుకురామ్మా అన్నాడు.మునీలా పెళ్ళి చూపుల్లాగా ఫీలవుతూ మంచి డ్రస్ వేసుకొని సిగ్గుపడుతూ ఇచ్చింది.పెళ్ళికొడుకులాగా శ్రీహరి నీళ్ళు తీసుకొని తాగుతూ మునీలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. రామకృష్ణ “పద అరటిపండ్లు అన్న వాళ్ళింట్లో ఇద్దాం” అంటూ గెల ఎత్తాడు.శ్రీహరి గెలను లాక్కుంటూ మునీలా వైపు చూసి “నేను తీసుకెళ్తాలే మావా “అనడంతో రామకృష్ణకి అనుమానం వచ్చి “ఏం పని చేస్తున్నావ్ రా “అన్నాడు.”సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని మావా నెలకు ఎనబై వేలు” అన్నాడు శ్రీహరి.ఇంజనీర్ జీతం లక్ష రూపాయలైనా డాక్టర్ తర్వాతే ఎవురైనా అంటూ మునీలా వైపు చూసి లోపలికెళ్ళమని సైగ చేశాడు.
శ్రీహరి గెల తీసుకొని బైకెక్కి నేరుగా ఇంటికెళ్ళిపోయాడు.రామకృష్ణ”వీడు అన్నోళ్ళకి అరటి గెల ఇవ్వకుండి వెళ్ళిపోయాడేంటి.అంటే వీడొచ్చింది నా ఇంటికేనన్నమాట.అంటే మునీలా కోసమేనా” ఓ కంట కనిపెట్టాలనుకుంటూ లోపలికెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు.మునీలా డ్రస్ మార్చేసింది. “ఓహో ..స్విచ్ ఇక్కడే ఉందన్న మాట అనుకుంటూ పడుకున్నాడు.ఏవేవో ఆలోచనలు రామకృష్ణ మదిలో తిరుగాడుతున్నాయి.నిద్ర పట్టట్లేదు.అర్థరాత్రయింది అందరూ నిద్రపోయారు.రామకృష్ణ లేచి మునీలా ఫోన్ తీసుకొని లాక్ తీసే ప్రయత్నం చేశాడు.కుదరలేదు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ కుదరట్లేదు.ఇంతలో మునీలా లేచి రామకృష్ణ దగ్గరికొచ్చేసింది.ఏం నాన్నా నా ఫోన్ తీసుకొని ఉన్నావ్ అంది.”నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు పాపా.నీ ఫోన్ లాక్ తీసెయ్ పెదనాన్నకి ఫోన్ చెయ్యాలి.రేపు నలుగు కదా అరటి చెట్లు కోసం తెల్లవారు జామునే వెళ్ళాలి కదా” అన్నాడు.”ఇంత రాత్రి పూటా ఫోన్ చేసేది ఇంటికే వెళ్ళచ్చు కదా” అంది మునీలా.మీ పెదనాన్న ఎక్కడున్నాడో ఏమో ముందు లాక్ తీయ్ అన్నాడు.మునీలా అడ్డు చెప్పలేక లాక్ తీసిచ్చింది.”ఫోన్ చేసి మాట్లాడుతూ నువ్వెళ్ళమ్మా పర్సనల్ గా కొన్ని మాట్లాడుకోవాలి “అంటూ మునీలాని పంపేశాడు.వెంటనే ఫోన్ లో వాట్సప్ చాటింగ్ చూశాడు.అంతా డిలీట్ చేసేసి ఉంది.బ్యాక్అప్ చేసి మొత్తం చదివాడు. రామకృష్ణకి ఇంకా ఒకరికొకరు ప్రేమిస్తున్నారని చెప్పుకోలేదనే విషయం అర్థమైపోయింది.మనసులోనే ఉంచుకొని ఎక్కడ బయట పెట్టాలో ఎదురుచూశాడు.
నలుగు దగ్గరికి వచ్చిన శ్రీహరిని చూసి అందంగా ఉన్నాడు కానీ నాకెందుకో వీడు మునీలాకి కరెక్ట్ కాదనిపిస్తుంది అనుకుంటూ మునీలాని చూశాడు ఇద్దరూ ఒకరి వెనుక ఒకరు వెళ్ళడం చూసి వెనుకనే ఫాలో అయ్యాడు.ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని “మీ విషయం నాకు తెలిసిపోయిందబ్బాయ్.ని కూతురు నీతో చనువుగా ఉండి ఉంటే దానికి నేను క్షమాపణ చెప్తున్నా.నేను మునీలాని డాక్టర్ కే ఇచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నా.ఇద్దరూ ఒకే ప్రొఫెషన్ లో ఉంటే సంసారం బాగుంటుందని నా అభిప్రాయం.తర్వాత మీ ఇష్టం .కాదు కూడదని పట్టుబడితే పెళ్ళి చేసుకొని మీరు దూరంగా వెళ్ళి బతకండి”అంటూ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలి వెళ్ళిపోయాడు.శ్రీహరి మరిచిపోలేని బహుమతి అంటే ఇదేనా మునీలా అంటూ విచారంతో శ్రీహరి మునీలాని గట్టిగా పట్టుకున్నాడు.మునీలా “బావా నాకేం అర్థం కావట్లేదు బావా.ఏం చేయమంటావో నువ్వే చెప్పు”అంటూ చేతులు గట్టిగా పట్టుకుంది.శ్రీహరి “మావ అంత క్లారిటీ గా చెప్పాడు.ఆయన ఒక డాక్టర్ ని అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు.ఇప్పుడు నేను మధ్యలో దూరితే ఎవరికైనా ఇష్టముండదు.ఇంకా మన ప్రేమ తొలిదశలోనే ఉంది.మన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటే అలాగే విడిపోయి హ్యాపీగా ఉందాం అంటూ తొలిముద్దును మరిచిపోలేని బహుమతిగా బాధాతప్త హృదయంతో ఇచ్చి వెళ్ళిపోయాడు. మునీలా కన్నీటిని కార్చి తండ్రి కోసం తన హృదయాన్ని రాయి చేసుకుంది.

………………

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!