ఎల్లలు లేని ప్రేమ

(అంశం:: “నా ప్రేమ కథ”)

ఎల్లలు లేని ప్రేమ

రచన:తిరుపతి కృష్ణవేణి

నేను ప్రకృతి ప్రేమికురాలిని ప్రపంచంలోని అందమైన ప్రదేశాలన్నీ చూడాలని నా కోరిక. లలిత కళలు అంటే ప్రాణం. మా దేశమే కళలకు పుట్టిల్లు. చిత్రకళ,ఫోటోగ్రఫీ లంటే ఎనలేని మక్కువ. ఆ కోరిక తోనే నేను బ్యాచిలర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్(B.F.A)కోర్స్ మా దేశంలోనే పూర్తి చేసాను.ఇండియా అంటే నాకు చాలా ఇష్టం. మాస్టర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్(M.F. A) కోర్స్ ఇండియాలో చేయాలని నా ఆశయం. ప్రయత్నం మొదలు పెట్టాను.నా ఆశ ఫలించి ఇండియాలో,చిత్రకళా పరిషత్, బెంగుళూర్ విశ్వవిద్యాలయం లో సీట్ వచ్చింది. నా కోరిక నెరవేరి నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
నా మనసంతా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూంది. మొదటి సారి ఇండియాలో అడుగుపెట్టటం.
బెంగుళూరు నగరం చాలా అందంగాఉంది నాకు బాగా నచ్చింది. ఈ రోజు చిత్రకళా పరిషత్ లో జాయిన్ అవ్వాలి. అంతా క్రొత్త, కాలేజీ ప్రాంగణమంతా వివిధ దేశాలు,రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులతో సందడిగా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు రకరకాల వేశధారణాలతో రంగు రంగుల సీతాకోక చిలుకల్లా చూడ ముచ్చటగా కనపడుతున్నారు.
అయ్యో!
ఇంతకీ నేను ఎవరినో? చెప్పలేదు కదా! నా పేరు శిషిరి. నేను ఫ్రాన్స్ దేశస్థురాలిని.
ఒక సారి కాలేజీ ప్రాంగణమంతా కలయ తిరిగాను. అందరూ ఇంగ్లీష్ మాట్లాడు తున్నారు. నాకు ఇంగ్లీష్ మాట్లాడటంలో, కొద్దిగా ప్రవేశం ఉంది. ఇక్కడంతా కొత్తవారు భాషా భేదల కారణంగా, చిరు ధరహాసంతో, ఒకరికొకరు హాయ్!అని పలకరింపులతో పరిచయాలు చేసుకుంటున్నారు.అలా వారం, పది రోజులు గడిచాయి.
చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ స్కల్చర్ వంటి, తమ కిష్టమైన వివిధ కోర్సుల్లో విద్యార్థులంతా చేరి పోయారు .
టీ, భోజన సమయాలలో అందరం క్యాంటీన్ లో కలుస్తూ వుండే వాళ్ళము.చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతూ వుండే వారు. కర్ణాటక తమినాడు కేరళ జపాన్, విద్యార్థులు,ఒకే ఒక్కడు తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన తెలుగు విద్యార్థి అక్షయ్ మాతో స్నేహంగా ఉండే వారు.తనకి ఇంగ్లీష్ కూడా రాదు. ఇక్కడ తెలుగు ఎవ్వరికీ రాదు. అక్షయ్ కి ఇదో పెద్ద సమస్య,ఎవరితో మాట్లాడ లేక ఎవరినీ ఏమి అడగలేక తనలో తనే మదన పడే వాడు. అక్షయ్ తో మరో తెలుగు విద్యార్థి వుంటే బాగుండు అని అనుకునే దాన్ని అప్పుడప్పుడు.
అలా నెలలు గడచి పోతున్నాయి, నెమ్మదిగా ఒకరి భావాలు ఒకరం అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకుంటున్నాము.మేమంతా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటుంటే, సరిగా అర్ధం కాక అక్షయ్ ఇబ్బంది పడుతుండే వాడు.ఒకసారి అందరం అనుకొని అక్షయ్ కి ఇంగ్లీష్ నేర్పించటంమొదలు పెట్టాము.
అలా నేను, దీపు (కర్ణాటక,) మెగు (జపాన్),అక్షయ్, (తెలంగాణ,) మొత్తం నలుగురము మంచి స్నేహితులము అయినాము.ఒక సంవత్సరం కావస్తూంది. నా కోర్స్ పూర్తి అయ్యే సమయం దగ్గరపడుతూవుంది. మా దేశం వెళ్లేముందు ఇండియా లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడాలి అని, నలుగురం స్నేహితులము హైదరాబాద్ వచ్చాము.అక్షయ్ వాళ్ళ ఊరు అక్కడికి దగ్గరే నని అందరం అక్షయ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము.
అక్కడి పల్లె వాతావరణము, పచ్చని పంట పొలాలు, గోదావరి నది, వాగులు, అడవులు, బాగా నచ్చాయి.అక్కడి ప్రజలు వారి వృత్తులు,వ్యవసాయ పనులు మమ్ముల్ని ఎంతగానోఆకట్టు కున్నాయి. దానికి తోడు అక్షయ్ వాళ్ళ కుటుంబo చూపించిన ప్రేమాభిమానాలు మాకు ఆనందం కలిగించాయి.బెంగుళూరుకు తిరిగి వచ్చిన కొద్దీ రోజులకీ నేను మా దేశానికి తిరిగి వెళ్ళాను. వెళ్ళిన తరువాత నాకు అర్ధం అయ్యింది. నా స్నేహితులకి దూరం అయ్యాననే బాధ మిగిలింది.
చాలా సార్లు ఫోన్ చెయ్యాలి, అని అనుకొనే దాన్ని కాని, సమయం అనుకుంలించక చేయలేక పోయాను.కొంత కాలం తరువాత అక్షయ్ కి ఫ్రాన్స్ లో జరిగే ఆర్ట్ గ్యాలరీలను చూడటానికి అవకాశం దొరికింది. కళలకు పుట్టినిల్లు అయిన ఆ దేశాన్ని ఒక్కసారైనా చూడాలి అని,ఆ విషయం శిశిల్ కు తెలియ జేశాడు.
ఫ్రాన్స్ రావటానికి తగు ఏర్పాట్లు చేసి అక్షయ్ ని ఆహ్వానించాను.చాలా కాలము తరవాత అక్షయ్ ని చూడటం నాకు ఎంతగానో సంతోషాన్నిచ్చింది. నేను ఇండియాలో వున్నప్పుడు అక్షయ్ ఎలా చూసుకునే వాడో?ఎంత సహాయంగా వుండే వాడో?అన్ని వివరించి చెప్పి, నా కుటుంబ సభ్యులకు పరిచయము చేసాను. అక్షయ్ ఉన్నన్ని రోజులూ కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు,ఆర్ట్ గ్యాలరీలు చూపించాను మా కుటుంబ సభ్యులకు కూడా అక్షయ్ చాలా బాగా నచ్చాడు. రోజులు ఇట్టే గడిచి పోయాయి. అక్షయ్ తిరిగి వెళ్తుంటే మా అందరికి చాలా బాధ అనిపించింది.నేను ప్రతి సంవత్సరం ఒక క్రొత్త ప్రాంతం వెళుతుంటాను. అక్కడి మహిళల పరిస్థితులు, వారి చదువులు, ఉద్యోగ అవకాశలు ఎలా ఉన్నాయి అధ్యయనం చేస్తుంటాను.అది నా హాబీ. ఈ సారి కేరళ సందర్శనార్థం ఇండియా వెళ్ళవలసి వచ్చింది. ఆ క్రమంలో హైదరాబాద్ వెళ్లి అక్షయ్ తో కలిసి మాట్లాడాలి, మంచి అవకాశం దొరికింది, అని నిర్ణయించుకొని బయలు దేరింది.నా తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ లో అక్షయ్ ని కలిసాను. నా మనసులో ఉన్న విషయాలు, అనుమానాలు. అన్నీ మాట్లాడుకున్నాము. అక్షయ్ పరిస్థితి కూడా నాలాగే ఉంది అని గమనించాను.అక్షయ్ వాళ్ళ అమ్మ నాన్నలు అక్కడే ఉన్నారు. నన్ను సాధారంగా ఆహ్వానించారు. ఉన్నన్ని రోజులు చాలా ఆప్యాయంగా చూచు కున్నారు.
తర్వాత నేను ఫ్రాన్స్ బయలు దేరివెళ్లాను.చూస్తుండగానే సంవత్సరాలు గడచి పోయాయి.మా పెద్ద వాళ్ళతో అక్షయ్ విషయం చెప్పాను.
నా నిర్ణయాన్ని వాళ్ళు అంగీకరించారు.అక్షయ్ వాళ్ళ అమ్మ, నాన్నలతో మేము ఇద్దరం కలిసి మాట్లాడితే సమస్య ఒక కొలిక్కి వస్తుందని, అక్షయ్ వాళ్ళ ఇంటికి ఇండియా వెళ్లాలని నిర్ణయించుకున్నాను.
దానికి తగిన ఏర్పాట్లు చేసుకొని బయలు దేరాను. అది మార్చి 8, న అక్షయ్ వాళ్ళ ఇంటికి (ఇండియా ) చేరుకున్నాను. మేము ఇద్దరం కలసి మా ప్రేమ విషయం చెప్పాము. ముందు ఒప్పుకోక పోయినా! చివరకు అంగీకరించారు. మా ప్రేమ సగం సుఖంతమైనది.
మేము మా వాళ్లను కలిసే దానికి బయలు దేరుదామనుకున్నాము. ఇంతలోనే మాయదారి మహమ్మారీ కరోనా విలయంతాండవంతో ప్రపంచాన్ని చుట్టు ముట్టింది. లక్షలాదిగా ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాపితంగా అన్ని ప్రభుత్వాలు లాక్ డౌన్ లు విధించాయి. విమానాలు. రైళ్ళు,బస్సు ల ప్రయాణాలు రద్దు అయ్యాయి.ప్రజలే బయటకు రాని పరిస్థితి. విపరీతమైన భయాoదోళనలు మొదలైనాయి. నేను అక్షయ్ ఇంట్లో ఆగి పోవలసి వచ్చింది.ఇతర దేశాలనుండి వచ్చిన వారుంటే తెలియ జేయాలని ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. అక్షయ్ వాళ్ళ నాన్నగారు నాగురించి హెల్త్ వారికి, పోలీస్ dept కు తెలియ జేశారు. వెంటనే CID పోలీస్ వారు ఇంటిలిజెన్స్ పోలీస్ వారు ఎక్కడకు ఎందుకు వచ్చావు? ఏం పని? ఎవరి గురించి వచ్చావు? రకరకాల ప్రశ్నలు వేశారు. నా అడ్రస్., నా పాస్ పోర్ట్ తీసుకున్నారు. మీ తల్లిదండ్రులు, ఫ్రాన్స్ లో ఎక్కడ ఉంటారు.ఏం జాబ్ర చేస్తుంటావు.? అడ్రస్ లు ఏంటి? ఇలా కరకాల ప్రశ్నలు వేసి సమాచారం తీసుకున్నారు. జ్వరం వస్తుందా? జలుబుందా? రకరకాల టెస్టులు హెల్త్ వాళ్ళు చేశారు. రోజు ఇంటి ముందు పోలీస్ రెవెన్యూ,హెల్త్ అధికారులు.హాజరై రిపోర్ట్ తీసుకొని వెళ్లేవారు. లాక్ డౌన్ లు పొడిగించటం వలన నా పాస్ పోర్ట్ డేట్ రద్దు అయినది. ఇట్లా ఆరు నెలలు నేను అక్షయ్ వాళ్ళ ఇంట్లో ఉండాలిసి వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్నలు, ఎంతోప్రేమగాచూసారు. మా అత్తయ్య గారు నాకు కాలసిన విధంగా వంటలు చేసి పెట్టారు. మరలా పాస్ పోర్ట్ కు ధరఖాస్తు చేసికొనుటకు,రెండు సార్లు నేను అక్షయ్ పోలీస్ సూపరెండెంట్ గారి ముందు హాజరవటం జరిగింది.ఇలా ఎన్నో కష్టాలు పడ్డాము. ఏదయితేమి. మా ప్రేమ ఫలించింది. ఎనిమిది సంవత్సరాలు గా మేము ఎదురుచూసిన మా ప్రేమ ఫలించిది. నేను ఇక్కడ ఉండటం వలన నా ఇండియన్ ఫ్యామిలీ నాకు చాలా దగ్గరైనది. ఒకరి నొకరం అర్ధం చేసుకొనే అవకాశం కలిగింది. కరోనా మహమ్మారీ కాస్త శాంతించటం వలన మాకు పాస్ పోర్టు లు రావటం జరిగింది. మా ప్రయాణ తేదీ ఖరార్ అయ్యింది. ఈలోగా విపరీతమైన తుఫాన్, వరదలు, మేము విజయవాడ నుండి ఫ్లైట్ ప్రయాణం. దారులన్నీ వరదలతో ముసుకు పోయాయి. అక్షయ్ వాళ్ళ మామయ్య కారు ఫ్లైట్ టైంకు చేరుకోవటానికి
అర్దరాత్రి అడవిలో ప్రయాణం చేయవలసి వచ్చింది. నేను మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేసాను. నాకు జీవితంలో మరచిపోలేని అనుభవం. మొత్తనికి డ్రైవర్ చాక చక్యాంగా సమయానికి గమ్యం స్థానం చేర్చాడు.
త్వరలో మా పెళ్లి జరగ బోతుంది. ప్రేమకు ఎల్లలు లేవు? అని నిరూపించాము.

***

You May Also Like

One thought on “ఎల్లలు లేని ప్రేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!