రూప శ్రీ

రూప శ్రీ

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

సూర్యోదయానికి ముందే శాస్త్రి గారు గోశాలలో గోవులకు పూజ చేసి నీరు పెట్టీ గడ్డి వేస్తారు పాలేరు వచ్చి ఉలవలు చిట్టు తవుడు కలిపి గబెళలో వేసి నాలుగు అవులకి దూడల కి పెడతాడు.

ఈలోగా పాల తప్పేలా తెచ్చి అన్న పూర్ణ గారు పాలు పితుకు తుంది పాలు తెచ్చి పెద్ద కుండలో పోసి సన్న సెగన పెడుతుంది.పాలు కాగి మంచి కమ్మని రుచి ఉంటాయి కుండ పాల రుచి అలవాటు పడ్డ వాళ్ళు మామూలు గిన్నె పాలు నచ్చవు .

శాస్త్రి గారు సంధ్య వందనం ముగించి వేడి పాలు బెల్లం వేసి ఏలకుల పొడిని వేసుకుని దేముడికి నివేదన పెట్టీ తాగుతారు

ఈ లోగా పిల్లలు లేచి ఎవరి పనుల్లో వారు బిజీ .పెద్ద పిల్లాడు వ్యవ సాయం.చూస్తాడు రెండో కొడుకు డాక్టర్ మూడో కొడుకు ఇంజినీర్ నాలుగో కొడుకు బ్యాంక్ ఉద్యోగి నలుగురు కూతుళ్ళు

ఉన్న పొలం పంచుకుంటే అందరికీ చాలదు అంటూ డాక్టర్ కొడుకు రామ్ ఇంజినీర్ కొడుకు శ్రీ దర్ కూడా కెనడా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నారు

వద్దు అంటే వినేవారు ఎవరూ?
నాన్న గారు మీరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చూడండి అన్నారు
వాళ్ళు కనీసం డిగ్రీ లేనిదే మంచి సంభందాలు రావు చదివించాలని రెండో కొడుకు పట్టు పట్టాడు
మాకు మీ అస్తి మీద ఆశ లేదు మీ అనంతరం ఎది ఉంటే అది తీసుకుంటాము చెల్లెళ్ళకు మంచి సంభందాలు చెయ్యండి అని చెప్పాడు

సరే రెక్క లొచ్చిన పక్షులు ఉద్యోగము లోచ్చిన కొడుకులు ఎవరి తిన్న వారు వెళ్ళిపోతారు అని శాస్త్రి గారు పూర్ణ గారు సరి పెట్టుకున్నారు

ఆడపిల్ల ల కోసం సంభందాలు చూస్తున్నారు మండువా ఇల్లు పెద్ద హాలు అటు ఇటు గదులు మెడ మీద గదులు పిల్లలకి ఎవరికి తిన్న వారు వారి గదుల్లో ఉండి చదువుకునే వారు మగ పిల్లలు నల్గురు తరువాత ఆడపిల్లలు నట్టీల్లు అంతా బంగారమే అన్నట్లు గా ఆడపిల్లలు పుట్టడం తో వారికి
మరింత సిరి వచ్చింది

మహారాజు గారు ఆస్థానంలో
పండితుడు గా నియ మించ బడ్డాడు ఇంటికి అన్ని వస్తువులు రాజు గారే పంపేవారు అల కొంత కలిసి వచ్చింది పెడ్డపిల్ల రెండో పిల్ల ఇంటర్ కాగానే పెళ్లి చేశారు
మూడు నాలుగు పిల్లలు ఇద్దరు డిగ్రీ చేస్తున్నారు
ఒక ఐదు ఏళ్ళు రాజుగారు
పోషణలో కుటుంబంలో ఆర్థిక పరిస్తితి మరింత మెరుగు పడింది
శాస్త్రి గారి అక్క చెల్లెళ్ళ పిల్లలు ఉన్నారు కానీ చదువులు అంతగా లేవు పొలాలు అంతంత మాత్రమే అందుకని పెళ్లి సంభందాలు బయటి వి చూశారు అయిన వాళ్ళు ఉండగా బయటి సంబంధాలు ఎందుకు అని మధ్య వర్తుల చేత కబుర్లు పంపారు

శాస్త్రి గారు మెత్త బడ్డా కొడుకులు ఇష్ట పడ లేదు మీరు ఎంత కట్నం అయినా ఇచ్చి చెయ్యండి డబ్బుకు వెను కాడ వద్దు అని చెప్పారు

ఈ రోజుల్లో ఇంజినీర్ కి ఇంజినీర్ సంబంధం కావాలి
డాక్టర్ కి డాక్టర్ కి డాక్టర్ చదివిన పిల్ల కావాలి అని అంటున్నారు పిల్లలు డిగ్రీ లు చదివిన సరే పెళ్లి కష్టం ఐయ్యింది

మొత్తానికి డబ్బు ఆశా చూపి అన్న గార్లు అంతా కలుగ చేసుకుని పెళ్లి చేశారు

అయితే శాస్త్రి గారి పిల్లలు అందగత్తెలు కదిలి వచ్చే లక్ష్మి దేవి లా నగలు పెట్టుకున్నారు
బ్యాంక్ ఎంప్లొయ్ ఒకరు సైంటిస్ట్ ఇంకొకరు ఇద్దరు కూడా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు

కాలం లో ఎన్నో మార్పులు కొడుకులు కూతుళ్ళని కొడుకులని కూడా డాక్టర్స్ చదివించారు భవిష్యత్లో పెళ్ళిళ్ళు దృష్టి లో పెట్టుకుని

అక్క చెల్లెళ్ళు కూడా తమ పిల్ల లను డాక్టర్స్ ఇంజినీర్స్ చదివించారు .

ఈ తరం పెళ్ళిళ్ళు మరీ విచిత్రం గా ఉన్నది ఎంత చదివిన ఈ నాడు సం పా దించే డబ్బు మీద ఆధారపడి ఉన్నది ,

రెండు మూడు ఇండియా సంభందాలు చూస్తే పాత విధానంలో మార్పు లేదు
ఆనాడు కట్నం ఈ నాగు నెల వారి సంపాదన అడుగుతున్నారు
కొందరయితే విదేశీ పిల్లలు వద్దు ఎంత డబ్బు ఉన్నా మా కవ సరం లేదు అని చెప్పారు

తిరిగి పెళ్లి విషయంలో మళ్లీ సమస్య ఎదురు అయ్యింది
శాస్త్రి గారి కొడుకులు మాత్రం తెలుసున్న సంభందాలు చేసుకున్నారు

కానీ ఈ రోజుల్లో ఆలా కాదు
చదువు సంధ్య ఉన్నా సరే జీతం విలువతో పోలికలు
అంతా స్టేటస్ ఇంత స్టేటస్ అంటూ ఉంటున్నారు

శాస్త్రి రెండో కొడుకు కూతురు రూప కొడుకు శ్రీనివాస్ ఇద్దరు డాక్టర్స్ చదివారు ఇండియా సంభందాలు కోసం ఎంత వెతికినా ఎవరు సరి అయిన వాళ్ళు లేరు కోట్లు మీద కట్నాలు మాట్లాడారు

విదేశాల్లో పెరిగి చదువుకున్న వాళ్ళు మాకు వద్దు అంటూ మరి కొందరు పెదనాన్న పిల్లలు అక్కలే నీ కూతురు విదేశీ పద్దతిలో ఉంటుందని విన్నాము మాకు వద్దు మేము మీకు సరి పోము అన్నారు

ఇదే అక్కల చెల్లెళ్ళ పెళ్లిళ్ళా కోసం పొలం డబ్బు అన్ని వదిలేసి రెక్కలు పట్టుకుని విదేశాలు వెళ్లి పోయారు

ఇండియాలో ఎన్ని తరాలు మారినా పెళ్లిళ్ల కట్నం విషయంలో మార్పు లేదు అని అనుకున్నాడు

ఇదే విషయం తండ్రి తో అన్నాడు
శాస్త్రి గారు నవ్వి కాలంతో పాటు మార్పులు అని చెప్పాడు అంతా పండితుడు జ్ఞాన వంతుడు అయిన శాస్త్రి గారి మార్పు కొడుకుల్లో ఎంతో
ఆశ్చర్యం వేసింది ఇన్నాళ్లు తండ్రి కొప్పడీ బాధ పడతాడు అనుకున్నారు కానీ తండ్రి గ్రీన్ సిగ్నల్ చూసి ఆనంద పడ్డారు

ఎక్కడి దేశం సంస్కృతి నీ బట్టి మారే కాలంతో పాటు మారాలి అంటూ మనుమలు కు నచ్చిన సంభందాలు ఉంటే చూసి చెయ్యండి అని చెప్పాడు

ఆ దే మాట కూతురు కొడుకు తో చెపితే నవ్వారు తాత గారు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు అన్నారు రూప తనతో చదివిన
శ్రీ వేంకటేశ్వర పట్నాయక్ నీ
కొడుకు రెజీనా నాని పెళ్లి చేసుకోవడానికి నిచ్చాయించారు
విదేశీ కాల మానంతో సరి చేస్తూ ముహూర్తాలు పెట్టారు
చాలా రోజుల నుంచి విదేశాల్లో ఉన్నారు అటు తరుపు ఇటు తరుపు బంధువులను పిలిచి ఘనంగా పెళ్లి చెయ్యి నిచ్చయించారు

ఆ ఊళ్ళో అంతా శాస్త్రి గారు మనుమరాలు మనుమడు పెళ్లి చూడటానికి ఇంటి ముందు పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు

విదేశీ హోదా పద్దతులు అన్ని కూడా మనదేశం పద్దతిలో జరిగింది
శాస్త్రి గారు అక్కడ కావాల్సిన వారిని పిలిచి పెళ్లి చూశాక బూర్లు పులిహోర దద్దోజనం లడ్డూలు వేసి ఘనంగా పెళ్లి భోజనం పెట్టీ అరిసెలు మైసూర్ పాక్ కాజ లడ్డు మిక్చేర్ ప్యాకెట్లు ఇళ్లకు సారిగా పంచారు గట్టి మేళం లో పిడికిి ట తలంబ్రాల పెళ్లి కూతురు బ్యాండ్ వారు వాయించారు
ఇక్కడి సంగీతం బ్యాండ్ విడియోలు పంపారు

అక్కడి వాళ్ళకి మన పెళ్లి పాటలు నేర్చుకున్న వారి చేత కచ్చేరి గా ఏర్పాటు చేశారు.

అంతా శాస్త్రి గారీ పెద్ద మనస్సుకు మెచ్చుకున్నారు
కొందరు ఈర్ష్య పడ్డారు
ఎంత గొప్ప పండితుడు మనుమలు ఎలా రాష్ట్రేతర
దేశ విదేశీ పెళ్లిని గౌరవించడం లో ఆయన ఎంతో గొప్పగా కొడుకులకి మనుమలికి అనిపించింది ఎంతో గర్వపడ్డారు మారే కాలంతో మార్పు సహజమే కదా పెద్దలు పెద్ద మనస్సుతో పిల్లల్ని దీవించండి శాంతి శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!