మాట అదుపే మంచి పొదుపు

మాట అదుపే మంచి పొదుపు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: గాజుల నరసింహ

“నాలుగు కొప్పులు కలిస్తే కబుర్లకు కొదవ ఉండదు” అనే నానుడి ఇదివరకు వుండే వుంది. “ఆడవారి నోట ఏమాట దాగదు అన్న విషయం కూడా మనకు తెలిసిందే కదా”.. ఒక ఊళ్ళో ఇంటింటి కథలు యేలా వున్నాయో ఆ కథలలో పాత్రధారులు ఎలా ఉంటారో తెలుసుకుందామా.. మరి.!

     పచ్చనైనా ఒక పల్లెటూరు.. ఆ ఊరిలో నాలుగు వీధుల జనం ఇంటి వారసాలలో.. లేక తెరమాలలో, లేక నడిబొడ్డుగా వున్నా ఒక పెద్ద అరుగు అరుగుపై ఒక పెద్ద చెట్టు.. ఆ చెట్టు కింద ఊరి ప్రజలు.. కూర్చోని ఊరిలో జరిగే సంగతులన్నీ అక్కడ ముచ్చటిస్తూ వుంటారు.. “గురిగింజ తన కింద నలుపును ఎరక్కా.. నేనెంతో అందమంటూ అందరిని ఎగతాళి చేస్తూ ఉన్నట్టుగా”. ఎవరూ తప్పు చేయనట్టు యే ఇంటిలో యే సంగతి లేనట్టు తమ సంగతి పక్కవారికి ఎవరికీ తెలియనట్టు.. పక్కవారి గోడును వెళ్లబుచ్చుతూ వుంటారు కొందరు. అలా ఎలా అనగా. తెల్లవారు జామున అందరికీ పనులు ముడిపడతాయి. ఎందుకంటే 8నుంచి 9 గంటల సమయంలోపు ఎవరి పనులకు వాళ్ళు ఎల్లాల్సి ఉంటుంది. పొద్దు పొద్దున్నే ఇంటి ముందు కళ్ళాపి జల్లుకుంటూ తెల్లెచెంబులు తోముకుంటూ వుంటారు. కళ్ళాపి జల్లే నాగమ్మ   ఎదురుగా అంట్లు తోమె లచ్చమ్మను. “ఒసేయ్.. లచ్చి నీకు యిది తెలుసా.. (తెలియదు అంటూ లచ్చమ్మ తల అడ్డంగా ఆడిస్తుంది )ఎంకటమ్మ మనవరాలు రాత్రికి రాత్రి ఆ చింటూ గానితో పోయిందంటనే.
లచ్చమ్మ :- ‘అవునా…( హు0…) అర్నీ…దీనికేమి పోయాకాలామోచ్చిందిందే’. “అయినా తల్లి తక్కువనా జేజి తక్కువనా.. వాళ్లకు తగ్గట్టే యిది”..”తల్లి చేను మేస్తే పిల్ల కంచె మేస్తాదా యేంటి.. దొందు దొందేగా”…( ఒసేయ్ కాపీ పెట్టవే.. ఇంట్లో నుంచి లచ్చమ్మ భర్త అరుపులు..)ఒకసారికి బదులు ఇవ్వదు రెండోసారి బదులు ఇవ్వదు, నాగమ్మతో రసకత్తుగా.. మాటల్లో వుంది. ఇక్కడ ఆయనకు కోపం వచ్చి. “ఒసేయ్ బద్మాష్దాన మొత్తుకుంటుంటే వినిపించడం లేదా అంటూ కర్రతో కొట్టబోతాడు. అపుడు లచ్చమ్మ ఏం నీ అరుపు “కొడతావా.. కొట్టు మల్లా.. అంటూ ఆమె చేతిలో సరువను అతని మీదకు ఎత్తుతుంది”. యిది చుసిన నాగమ్మ చిన్నగా అక్కడి నుంచి తనపనిలోకి తాను జారుకుంటుంది. లచ్చమ్మ భర్త అవతల నాకు పని వుంది నేను పోవాలి బెరీనా.. కాపీ చేదురా.. అంటూ ఇంట్లోకి తోసుకుంటూ పోతాడు. కొద్దిసేపటికి బజారు కోలాయికి నీళ్లు వస్తాయి. అక్కడ అందరూ ఒంతులు పెట్టి నీళ్లను పట్టుకుంటూ వుంటారు. అప్పటికే నాగమ్మ లచ్చమ్మను మొగుడు కొట్టబోయిన విషయం నలుగురికి అందించి ఉంటది. కోలాయి దగ్గరికి. ఆ వీధి వారంతా నీళ్లకు వస్తారు. అక్కడికి లచ్చమ్మ, నాగమ్మ, ఎంకటమ్మ కూడా వస్తారు. నీళ్లకాడ చిన్న గొడవ మొదలు అవుతుంది. ఎంకటమ్మా  కొంచెం దౌర్జన్యం మనిషి. మధ్యలో దూరి లచ్చమ్మ ఒంతు వచ్చినపుడు నాది అంటూ బిందె పెడుతుంది, అపుడు లచ్చమ్మ నాది నీదికాదు అంటూ కాస్త వాదం జరుగుతుంది. ఎంకటమ్మకు లచ్చమ్మ ఏమాత్రం తగ్గలేదు. అందుకని పోద్దున్నే మొగుడు వీపులు పలగొట్టిన నీకు రిమ్మ అనగలేదు కదే! అంటూ మాట వెనక మాట అంటుంది. ఎంకటమ్మ. ఆ.. ఎపుడు కొట్టినాడే నన్ను..నువ్వు చూసినవా.. ఆ నువ్వు చూసినవా! అంట. అని ఆవేశంతో అంటుంది. ఆ ఎవరికి తెలీదు సందు సంధుకల్లా తెలుసు అందరూ అనుకుంటుంటే నేను విన్నాను. అంటూ ఏంటే నాగమ్మ దాన్ని మొగుడు దాన్ని పొద్దున కొట్టలేదే. నువ్వే కదే చెప్పింది అంటూ ఆమెను అంటుంది. నాగమ్మ ఈ కంప నాకు ఏడ కర్చుకుంటుందో. అని తనలో తాను పిసుక్కుంటుంది. అంతలాగే.. నీ మనవరులు ఎవనితోనే లేచిపోయిందంట కదా! ఎవ్వడికి తెలీదు మన సింగారం అంటూ మిడిమిడి మాటలంటుంది లచ్చమ్మ. ఇలా ఒకరిది ఒకరికి చెప్పింది నాగమ్మ. వాళ్ళు అలా అనుకుంటూ ఉంటే తనుమాత్రం ఏమి ఎరగనట్టు మెల్లకుండా వుంది. పక్కనున్నవాళ్లు వీళ్ళను సముదాయిస్తూ వున్నా వీరు ఊరుకోరు. అలలాగే నీళ్లు పోయంతవరకు గొడవ పడుతూనే వుంటారు. నీళ్లు పోయినాయ్ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. నాగమ్మ ఇంటికి నీళ్లు కడవ తీసుకొని పోతుంది ఇంట్లో కోడలు బండలు తుడుస్తూ ఉంటుంది. నాగమ్మ తడికాళ్ళతో, కాస్త బురదతో అలాగే ఇంటి లోపలికి వెళుతుంది. యేంటి నువ్వు నేను కన్నెగ తుడుస్తుంటే, అంతా తొక్కుకుంటూ వస్తున్నావ్ కాసేపు ఆగలేకపోతివా! అని కోడాలు అంటుంది. ఆ నాకు నేను వయస్సు దాని కదూ పట్టలేక పోతున్నాణమ్మ అంటూ ఆమెకు నాగమ్మ ఇరవోటిగా అంటుంది. నాగమ్మ కత్తి అయితే కోడలు కొరివి. ఒకరిది ఒకరికి పొత్తు కుదరదు. సరే ఆడికి గమ్మున వుంటారు. కూలిపొద్దు అయ్యింది అందరూ పొలం పనులకు వెళ్తారు. పొలంలో పనులు చేసుకునేటప్పుడు సరదాగా కబుర్లు పాటలు పాడుకోవటం మామూలే. ఇండ్లకాడి చరితలన్ని  పొలాల్లో అనుకుంటారు. అలా ఆరోజు గడిచిపోయింది. మరుసటి రోజూ తెల్లవారింది అందరూ యాదవిధిగా తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు ఉదయం పూట. ఊళ్లోకి బిచ్చగాళ్లు పొద్దున్నే రావటం యానవాయితీ. “గుట్టు గుట్టు గూటికెరుక గూడు కట్టిన గువ్వాకెరుక, ఆ గువ్వగుట్టు గురుడు ఎరుక గురుడ గురుడనే నేనురా..ఆ గురుడ గురుడనే నేనురా.” “కీర్తనలు పాడుకుంటూ వీధి వీధి తిరిగి బిచ్చం తీసుకొని వెళ్తారు. ఇలా ఇంటింటికి కథలు ఎన్నో ఉంటాయి అందరికి ఉంటాయి. అందరి కథలు ఎరిగే వాడు ఒకడు ఉంటాడు. వాణ్ని ముందు మనకథలు సాగవు. కావున నీతి ఏమిటంటే.. ఒకరి తప్పుల్ని ఒకరు వేలెత్తి చూపరాదు పరుల గురించి మాట్లాడరాదు, ఇలా చేస్తే సమస్యలు కొని తెచ్చుకొన్నట్టే ఉంటుంది అని భావన.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!