బుద్ధుందా అంకుల్

బుద్ధుందా అంకుల్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యం. వి. ధర్మారావు

నిరంజనరావు, నీరజలు దంపతులకు సిద్ధి, బుద్ధి అనే అమ్మాయిలు కలరు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ ఒకరైతే, సెకండ్ ఇయర్ మరొకరు చదువుచున్నారు. వీరి పేర్లుకూడా పెద్దవారి పేర్లు కలపాలని నిరంజనరావు అమ్మపేరు సిద్ధి నారాయణమ్మ అయితే నారాయణమ్మ అయితే బాగుండదని ముద్దుగా సిద్ధి అని పిలుచుకుంటారు. అలాగే నీరజ అమ్మపేరు బుద్ధి భూలోకమ్మ అయితే, బుద్ధి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ రోజుల్లోనే “ఒసేయ్ నీరజ బుద్ధి అంటే బాగోదే మరేదైనా పేరు పెడదామే అంటే నీరజ వినకుండా ఏం మీ అమ్మపేరు పెట్టుకుంటే బాగుంటుందిగాని, మా అమ్మపేరు బాగుండదా!” అదే బాగుంటుంది లేండి అలవాటైతే అని మూర్ఖంగా వ్యవహరించేది.
ఈ విషయమై ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగేవి కాని నీరజదే పైచెయ్యి అయ్యేది. నిరజనరావు ఓ ప్రయివేట్ ఆఫీసులో గుమస్తా! ఆ ఆఫీసులో పని ఒత్తడి ఎక్కువ. ప్రతీ చిన్నపనికి నిరంజనరావునే వాడేసుకుంటారు. “ఆఫీసులో మంచి పేరుంది నిరంజనరావుకి”, “గాడిద చాకిరీ చెయ్యాలంటే నిరంజనరావే సమర్ధుడు అని, సుద్ధ ఎర్రిపప్ప అని అందరూ వేళాకోళాలు ఆడుతూ ఉంటారు”. పాపం అమాయకజీవి నవ్వేసి ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయేవాడు. ఆ ప్రస్టేషన్ ఇంటి దగ్గరైనా చూపిద్దామంటే ఇంటి దగ్గరా తన బలం చాలదు.
“ఒకసారి ఆఫీసు నుండి అప్పుడే ఇంటికీ వచ్చి కూర్చున్నాడు. ఇంతలో తన కూతురి స్నేహితురాలు వనజ వచ్చి “బుద్ధి ఉందా అంకుల్” అంటే నిరంజన్ రావుకి మండిపోయింది. మళ్ళీ ఆ అమ్మాయి అంకుల్ బుద్ధుందా! అంటే నిరంజనరావుకి చిర్రెత్తుకొస్తుంది. ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటాడు. ఇంతలో నీరజ వచ్చి ఏంటమ్మా! వనజా ఇలావచ్చావు అంటే దానికి నీరజ “బుద్ధి కోసం” అంటీ అనంటే లోపలవుంది వెళ్ళమ్మా! అంటే సరే ఆంటీ అనుకుంటూ బుద్ధి గదిలోకి వెళ్తుంది వనజ. అలా వెళ్ళిన తర్వాత నీరజ నిరంజనరావు వైపుకి తిరిగి “ఏమండీ! మన బుద్ధి మనింట్లోనే కదా ఉంది. మిమ్మల్ని ఆ వనజ వచ్చి బుద్ధుందా అంకుల్ అని అడుగుతుంటే బుద్ధుంటే ఉందని చెప్పాలి, లేదంటే బుద్ధి లేదని చెప్పాలి” “అంతేగాని మండిబుకడంలాగ అలా బుద్ధిమాలినోళ్ళ లెక్క అలా చూస్తారేంటండి?” అంటూ చిర్రుబుర్రులాడుతూ ఉంటే దానికి నిరంజనరావు “నిన్ను నా బుద్ధి తక్కువై పెళ్ళిచేసుకున్నానే ఇప్పుడు ఇదిగో.. ఇలా చూడు లెంపలేసుకుంటున్నానే అనుభవించక తప్పదుగా!”
అంటూ ఉంటే దానికి నీరజ “అయ్యో మీకు బుద్ధి తక్కువైందనేగా నేను బుద్ధిని బహుమతిగా ఇచ్చింది అని ఛలోక్తి విసిరింది”. పాపం నిరంజనరావు మారు మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!