కలసి ఉంటే కలదు సుఖం 

కలసి ఉంటే కలదు సుఖం 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల 

ఒక ఊరిలో దుర్గమ్మ అనే పెద్దావిడ ఉండేది. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, తన ఇద్దరి మనవరాళ్లను పట్నం చదువులకు పంపించారు. పెద్ద కొడుకు భీముడు, చిన్న కొడుకు సోముడు. “ఆమె రోజూ ఇంటింటికీ వెళ్లి కూరగాయలు అమ్ముకుంటూ సంసారాన్ని నడిపిస్తూ ఏ లోటు లేకుండా చూస్తుండేది”. కొడుకులు ఏదో చిన్నా చితకా పనులు చేస్తారు. “పెద్ద కొడుకు భార్యకు భయపడి సంపాదించిందంతా భార్య చేతిలో పెడతాడు”. చిన్న కొడుకు మాత్రం తల్లి చేతిలో పెడతాడు. చిన్నకోడలు మాణిక్యం నవ్వుతూ అందరితో కలివిడిగా ఉంటూ అన్ని పనులు చక్కబెడుతూ అందరితో కలిసిమెలిసి ఉంటుంది చాల ఓర్పుగల అమ్మాయి. పెద్ద కోడలు కనకం పెద్ద ఇంటి నుంచి వచ్చనాన్న అహంకారంతో నోరు పారేసుకుంటుంది. అందరితో గొడవ పడుతుంది. ఏ పనీ చెయ్యదు భీముడు గొడవ పడవద్దని ఎంత చెప్పినా వినేది కాదు, భర్త మీదికి కూడా అలాగే గొడవపడెేది ఇరుగు పొరుగు వారితో కూడా గొడవపడుతుండేది. ఎప్పుడూ మాణిక్యాన్ని సాధిస్తూ ఉంటుంది. అయినా పల్లెత్తుమాట అనకుండా చెప్పిన పని చేస్తూ ఉంటుంది. సోముడు ఇవన్నీ ఏమీ పట్టించుకోడు. అది చూస్తూ దుర్గమ్మ బాధపడుతుండేది. “ఎలా చెప్పాలో అర్థంకాక  ఒకరోజు ధైర్యం చేసి ఏంటి కనకం రోజు దాన్ని ఏదో సాదిస్తూ ఉంటావు? అది నీ తోటి కోడలే కదా! అది ఇంటెడు చాకిరీ అదొక్కతెే చేస్తుంది. ఎందుకు అరుస్తావు? నువ్వు కూడా ఏదో ఒక పని చేయొచ్చు కదా! ఊర్కేనే కూర్చొని తింటూ దాన్ని ఒక్కటే సాధిస్తావు. నలుగురు ఉన్నప్పుడు నాలుగు చేతులు కలిస్తేనే పని తొందరగా అవుతుంది. అనగానే దుర్గమ్మపై భద్రకాళిలా లేసింది. ఓహో నీ చిన్నకోడలు ఎక్కువ, నేను తక్కువ నీ చిన్న కోడల్ని వెనకెసుకొస్తూ నాతో కావాలని గొడవపడుతున్నావు అంది. నెేను కావాలని గొడవ పడటం ఏంటి? నువ్వు చేస్తున్నది ఇదే కదా! “ఇదేమన్నా న్యాయంగా ఉందా? మళ్లీ నువ్వే అరుస్తున్నావ్ అంది”.   దుర్గమ్మ ! ఇప్పుడు నేనే గొడవ పడుతున్నానా అంటూ శోకాలు పెట్టింది. “నీ కొడుకు రాని అదేదో తేల్చుకుంటానంటూ కస్సుబుస్సు లాడుతూ లోనికి  వెళ్ళింది”. అత్తయ్య మీకు తెలిసిన విషయమేగా ఎందుకు అనవసరంగా గొడవ పడుతారు. ఊరుకోండి అంటూ మాణిక్యం నచ్చచెప్పింది. అలా కాదెే, ఇంకేం మీరు మాట్లాడకండి అంది కనకం.
భీముడు రాగానే జరిగిన గొడవ అంతా చెప్పింది. ఏంటి కనకం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటావా! ఊరికే ఉండలేవా! అంటూ కస్సుమన్నాడు. “ఆహా ఇంక మీరు కూడా నన్నే అంటున్నారా! అంటూ గొడవ గొడవ చేసింది”. ఎవరు ఏమి అనలేక గమ్మున ఊరుకున్నారు. సోముడు వచ్చి “అమ్మ ..నా సంపాదన అంటూ తల్లి చేతిలో పెట్టాడు”. సోముడు ఎక్కువగా మాట్లాడాడు తన పని తను చేసుకుంటాడు. ఇంటి వ్యవహారం ఏది పట్టించుకోడు. అంతా తన తల్లి చూసుకుంటుందన్న భరోసా. ఇలా అయితే బాగుండదని అనుకొని దుర్గమ్మ ఒకరోజు భీముడు ఇటు రా! అంటూ పిలిచింది ఏంటమ్మా చెప్పు అన్నాడు భీముడు. నీ సంపాదన నాకు ఇవ్వడం లేదు, మీరే దాచుకుంటున్నారు. ఇలా అయితే ఎట్లా నీతోటి వాడు సోముడు చూడు ఏమీ ఖర్చుపెట్టకుండా అంతా నాకే ఇస్తున్నాడు. నాకు మాత్రం ఏ పాటి వస్తాయి ఇంటి ఖర్చులు ఎలా సరిపోతాయి. వాడికి కూడా పిల్ల ఉంది వాడికి కూడా మిగిలాలి కాదా! అన్నది. “అమ్మా నేను మాత్రం ఏం చేస్తాను దాని గొడవ భరించలేక దానికి ఇస్తున్నాను.” అలా ఎలా కుదురుతుందిరా, నువ్వు నచ్చచెప్పుకోవాలి. వీళ్ల గొడవను చూసి చుట్టుపక్కల వాళ్లు ఏంటి దుర్గమ్మ రోజు కష్టంచేసి ఇంటికి వస్తే నీకు మనశ్శాంతి లేకుండా, “ఇంట్లో గొడవేంటి కోడలు అంతంత మాటలు అంటుంటే ఊరుకోవడ మేంటి దుర్గమ్మ? కోడలును మందలించ లేవా!” విడ్డూరం కాకుంటేనూ.. అన్నారు. ఏం చేయను వదినా.. దాని నోటికి భయపడాలి. ఇలా ఎన్నాళ్లు భరిస్తారు అంటుండేవారు. దుర్గమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు కనకానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనెే ఆలోచన వచ్చింది. కనకానికి నోటీ దురుసుతనం ఎక్కువ.. మాణిక్యానికి మొహమాటము ఏమీ అనదు అతి మంచితనం కూడా పనికిరాదు. దుర్గమ్మ బాగా ఆలోచించి ఒకరోజు కొడుకులను, కోడల్లను పిలిచింది. నలుగురు వచ్చారు ఏంటమ్మా పిలిచావు. “భీముడు, సోముడు ఇద్దరు వినండి నాకా వయసైపోతుంది.” “తిని కూర్చుంటే గుట్టలైనా అరిగిపోతాయి”. సోముడు అమాయకుడు మీలాగా దాచుకోవాలనెే తెలివి లేదు, మాణిక్యం ఏమీ మాట్లాడదు. “సంపాదించిందంతా నాకే ఇస్తున్నాడు. రేపు వాడి పిల్లలగతి ఏంటి”. “రెక్కాడితేగాని బుక్కాడని బతుకులు మనవి”. నీ భార్యను చూస్తే అలా ఉన్నది. అందుకని నేనొకటి ఆలోచించాను. అది ఏంటమ్మా? మీరు వేరే కాపురం పెట్టండి అని చెప్పింది. అదే ఏంటమ్మా అలా అంటావ్ అన్నారు. పెద్దోడా! నువ్వే వేరే కాపురం పెట్టాలి. ఇలా మీరు దాచుకుంటే చిన్నోడు సంగతేంటి? ఎవరైతే సంపాదించింది నాకు ఇస్తారో వాళ్లెే నా దగ్గర ఉండాలి అంది.” పెద్ద కోడలు కనకం గొడవ చేసింది. మేము వేరే ఎందుకుంటాం నేను కట్నం తెచ్చాను”. నీ కట్నం ఎవరికీ ఇచ్చావ్ నీ దగ్గరే వుంది. “మాకు ఆస్తులు పంచి ఇవ్వమంది”. నా దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి. “నా భర్త ఏం సంపాదించాడు ఉన్నది వాడి రోగానికి అయింది”. ఎక్కడున్నాయి ఆస్తులు నా దగ్గర ఏ ఆస్తులు లేవు, మీ కష్టం తోటి మీరు బ్రతకాలి అంతెే అంది. మీ తల్లిగారి వాళ్లు పెట్టింది నాకేం ఇవ్వలేదు. మీ సొమ్ము నాకు ఏమాత్రమూ పట్టదు కనకానికి నోట్లో వెలక్కాయ పడ్డట్టయింది. ‘తన తల్లిగారి పెట్టిన సొమ్ము తన దగ్గరే వుంది’. భీముడు సంపాదించుకున్న సంపాదన తనెే తీసుకుంటుంది. ఇంటి ఖర్చులకు ఇవ్వడం లేదు. తన తప్పు తనకు తెలిసి వచ్చింది. తన ఇప్పుడు వెళ్ళిపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది బయట. ఉంటే ఈ సంపాదన సరిపోదు. తనే కష్టపడాల్సి వస్తుంది. కనకం ఏం మాట్లాడకుండా మౌనంగా వుంది. ఏం మాట్లాడావ్ భీముడు అంది. నేను వేరే వెళ్ళను అన్నాడు భీముడు. వెళ్ళను అంటే ఎలా? ఉండాలంటే మీ సంపాదన నాకివ్వాలి అంది. “కనకానికి తెలిసి వచ్చింది తన తప్పేంటో”, పశ్చాత్తాపంతో, అత్తయ్య నాదే తప్పు నన్ను క్షమించండి. మేము కూడా నీకిస్తాము అందరం కలిసే ఉందాం రేపటి నుంచి తాను సంపాదించిన దాంట్లో కొంత సొమ్ము నీ చేతుల్లోనే పెడతాను. సోము సంపాదనది కూడా కొంత ఆదాచేయి. అత్తయ్యా అంది అలా అయితే నాకేం అభ్యంతరం లేదు అందరం కలిసి ఉంటామంటే ఇంతకంటే కావల్సిందేముంటుంది. నాక్కూడా సంతోషమే అంది “కలిసుంటే కలదు సుఖం వేరే ఉంటే ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి”. కలిసి ఉంటే కష్టసుఖాలు పంచుకుంటారు బుక్కలో బుక్కఅందరికీ కలిసివస్తుంది. కనకానికి జ్ఞానోదయమైంది. తోటికోడలు తోటి చీటికి మాటికి దెబ్బలాడకుండా సంతోషంగా ఉంటూ ఇంటి పనులు కూడా ఇద్దరు చక్కబెట్టుకుంటూ సంతోషంగా ఉన్నారు. దుర్గమ్మకి కూడా చాలా సంతోషంగా ఉంది. కుటుంబం అన్నాక చిన్నచిన్న తగాదాలు వస్తుపోతుంటాయి. వాటిని పట్టించుకోకుండా  పరిష్కరించుకోవాలి ఆనందంతో ఇక నాకు ఏ బాధా లేదు అంది దుర్గమ్మ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!