ఆమె

ఆమె

రచన: హసీనా ఇల్లూరి

ఆమె నవ్వినపుడు ఓ రోజా పువ్వు
ఆమె సిగ్గుపడితే ఓ ముద్ద మందారం
ఆమె కోపగించుకుంటే ఓ కనకాంబరం
ఆమె ఆహ్లాదం ఓ చేమంతి
ఆమె అలిగితే ఓ మంచు గులాబీ
ఆమె చిలిపిదనం ఓ మొగలిపువ్వు
ఆమె కొంటెదనం ఓ మల్లె పువ్వు
ఆమె అల్లరి ఓ చెండు పువ్వు
ఆమె ఉన్న నా జీవితం సప్తవర్ణాల హరివిల్లు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!