హృదయ గాయం

హృదయ గాయం

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

నిన్ను తలవని రోజు లేదు
నువు వస్తావని ఎదురు చూడని ఘడియలేదు

నన్ను ఎంతలా మురిపిస్తావో
అంతలా నన్ను ఏడిపిస్తావు

ఎందుకని నిన్ను అడగాలా
నా మది నీకు తెలియదా

నీకు నేను ఓ జ్ఞాపకమా !
నాకు నువ్వే ప్రేమ లోకమా
ఓ హృదయమా కలత వలదు

చెంతకు చేరు సమయం వచ్చేనో
దరి చేర అలరించి సేద తీరునో

పంచుకున్న మధుర ఊసులు
కలనైనా చెదర లేదే బాసలు

నువు లేని జీవితం ఊహించలేను
నాకు మరేది అగుపించలేదు

మనిషి చేసిన గాయం
మనసు మాటతో మాసి పోవునే

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!