ఆ రాత్రి

ఆ రాత్రి

రచయిత :: రవి బాబు బొండాడ

సమయం రాత్రి 11:15 నిమిషాలు ,కటిక చీకట్లు కీచురాళ్ళ శబ్దాలు, పోటీ పడుతూ ప్రశాంతతను దూరం చేస్తున్నాయి.
చీకట్లో చల్లటి గాలి , కొంటి మరదలిలా గిలిగింతలు పెడుతుంది . తెల్లవారితే శివరాత్రి , మూడు రోజుల ముందే అమావాస్య, ఆకాశంలో అల్లుకు పోయింది . బండి చక్రం తిరుగుతున్నట్లే ఆలోచనలూ వేగంగ పరుగెడుతున్నాయి. 30 నిమిషాలు ఇలానే గడిచింది… సమయం 11:45 నిమిషాలు అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు , నల్లటి తారు రోడ్డు చూద్దామన్న, ఎవరూ కనపడటం లేదు.గోల చేస్తూ హడవుడిగా వెళ్ళిపోయే లారీలు తప్ప.! సమయం 12: pm
నిర్మానుష్య మైన ఆకటిక చీకట్లలో ఒంటరిగా ఇప్పుడు వెళ్ళడం అవసరమా ? ఎంత మేక పోతు గాంభీర్యం ప్రదర్శించినా నా అంతరాత్మ భయాన్ని నూరిపోస్తుంది.
ఆభయం నుండి భయట పడక ముందే , కదులుతున్న నా బైక్ ఒక్కసారిగా ఏదో తాకినట్లుగా అప్రయత్నం గానే
పక్కకి వెళ్ళి పోయింది. మృత్యువు ముద్దు ,వెంట్రుక వాసిలో తప్పిపోయింది. ఒక వైట్ కలర్‌ ఇన్నోవా 160
పైగా స్పీడ్ గా అతి దగ్గరగా వెళితే ఎలా ఉంటుందో ఆక్షణానే తెలిసింది. అందరిలానే ఆక్రోశం అరుపు లా భయటకొచ్చింది. ఎం లాభం గాలిని చిల్చకుంటూ అప్పటికే కారు చాలా ముందుకు పోయింది. చేసేదేం లేక మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి ముందు కు కదిలాను . 5. కి.మీ అలానే దాటే సా.
అర్ధ రాత్రి , కటిక చీకటి నలుగురు వ్యక్తులు లైట్సు వేసుకుని ఆ రోడ్డు ప్రక్కన ఏదో చేస్తున్నారు. ఆ రోడ్ పై కొన్ని “బైక్ లైట్స్ ” వెలుగుతూ ఆరుతూ అస్పష్టంగా కనిపిస్తున్నాయి. కాసేపటికి ఆ నలుగురు ఐదుగుర య్యారు .ఆ ఐదోవ్యక్తిని నేనే .ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆత్రంతో వారిలో ఒకడినయ్యాను… ఆ సమయంలో నా చేతులు వణుకుతున్నాయి. ఎవరైనా బ్రతికి ఉన్నా రేమో చూద్దాం అంటున్న మాటలు నా చేవులను తాకుతున్నాయి. ఎంత సేపవుతుంది ఈ యాక్సిడెంట్ జరిగి అంటూ , తునాతునకలైపోయిన .. ఇన్నోవా కారు వైపు చూస్తున్నాను . ఎవరో లోపల నుండి కారు అద్ధంపై కొడుతున్న శబ్దం వినిపించి , పోన్ నుంచి చిమ్ముకొస్తున్న కాంతిని ఆ శబ్దం వైపు మళ్లించాను … రక్తంతో తడిసిన ఐదు వేళ్ళు అద్దాలపై కొట్టుకుంటున్నాయి.25 సం||ల యువకుడు కారు లోపల కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. మోకాళ్ళ లోతు పొలంలో అతి కష్టం మీద ఆ వ్యక్తిని భయటకు తీసాము. బాబు బాబు అంటునే అతని మాటలు ఆగి పోయాయి .
అతడి తల వాలి పోయింది . గుండెవేగంగా కొట్టుకోవడం అనే మాట ను అనుభవిస్తున్నసమయ మది. మరో రెండు కదలలేని శరీరాలు కళ్ళు తెరిచి మా ఐదుగురి వైపు చూస్తున్నాయి.ఆ సమయంలో భయం .. కంగారు .. బాధ… భావోద్వేగాలన్నీ నా లో చేరి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాని ఒక పసి దేహం ఇంకా ఊపిరి పీల్చు కుంటుంది . కాసేపటికే అటుగా వెళుతున్న కారులో ఆ బాబుని హస్పటల్ కి చేర్చడం , అత్యవసర చికిత్సా విభాగంలోకి తీసుకెళ్ళడం , జరిగి పోయింది .ఆ ఆసుపత్రి దృశ్యం ఇంటికెళ్ళేం త వరకు నా కళ్ళలో మెదులుతూనే ఉంది .ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు
అసలీ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి .
అతి వేగం వలనే కదా
వేగంతో వెర్రెక్కి ఒళ్ళు మరచి పోవడం ఎంత ప్రమాదం
రోడ్డున పోయేవాడూ ఒక ఆళి కి మగడే
ఒక తల్లికి కొడుకే
ఒక బిడ్డకు తండ్రే
మన వేగంతో ఆ బంధాలను బలి చేసే హక్కెవరిచ్చారు.
మరి ఆ వేగంలో మన కేమైనా అయితే
అమ్మ కన్నీరు తుడవగలమా
నాన్నను ఓదార్చ గలమా
బృందావనం లాంటి ఇల్లు ఏమై పోతుంది ?
ఇలాంటి ఆలోచనలతోనే రాత్రంతా గడిచి పోయింది. కాసేపటికే భళ్ళున తెల్లారింది , ఎంత ప్రయత్మించిన రాత్రి సంఘటన నుండి భయట పడలేక పోతున్న.
అదే ఆలోచనాలతో హాస్పటల్ వైపు అడుగులు కదిలాయి . కళ్ళద్దాలు తీస్తూ డాక్టర్ చెప్పిన మాటలతో నామనసు కుదుట పడింది.
కృతజ్ఞతా పూర్వకంగా చూస్తున్న వారి చూపుల మధ్య , ఒక ప్రాణం కాపాడాను అనే సంతృప్తితో ఇంటికి చేరాను.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!