పవిత్ర బంధం

పవిత్ర బంధం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాధ్

అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వచ్చిన కొడుకు రామంతో డెబ్బై ఏళ్ళ సావిత్రమ్మ నా మాట వినరా! మీ నాన్న గారు ఎనభై పడిలో ఉన్నారు. చాలా బాధ పడుతున్నారు. తాగి, దానితో ఆ చెడుతిరుగుళ్ళు తిరగడం చూసి ఆరోగ్యం పోతుందిరా ముఖ్యంగా లవుడు, కుశుడులా పన్నెండేళ్ళ నీ కవలపిల్లలకి జ్ఞానం వస్తోంది. నీ భార్య కమల చక్కని చుక్కలా ఉంది. అమాయకురాలు. ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అని మూడు ముళ్ళ బంధంవేసి పదహారో ఏట నీ వెనుక కొంగుముడితో వచ్చి ఇరవై ఏళ్ళయి నీతో బాటు, మమ్మల్ని కంటికి రెప్పలా చూస్తోంది. ఇంటి ఇల్లాలు కంటి నీరు అరిష్టం అంటున్న అత్త గారి మాటలు గదిలోని కమల విన్నది. అలాగే నువ్వు పడుకో అని తల్లితో చెప్పి రామం భార్య గదికి వచ్చాడు. భర్తను కాళ్ళు కడుక్కొని భోజనానికి రండి అన్న కమలతో రామం తెలిసే ఉన్నావా. భోజనం బయట చేసి వచ్చాను. అని కట్టుకున్న బట్టలతో పడుకోవడం చూసి భాధ పడింది. గతంలోకి ఆలోచనలతో వెళ్ళింది. పిల్ల అందంగా సంప్రదాయంగా ఉంటే చాలు మావాడు చదువక్కర లేదని ఏడేళ్ళు తేడా ఉన్నా ఆస్తి, అంతస్తు ఉన్న ఎం.బి.ఎ.చదివాడు. మీ పిల్లని మేనత్త కూతురి పెళ్ళిలో చూసాడని ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త రెండేళ్ళయి అమలాపురం నుంచి బ్యాంక్ అధికారిగా ప్రమోషన్ వచ్చి, ఆ క్లర్క్ సుందరి వలలో పడి చెడు వ్యసనాల బారిన పడటం బాధగా ఉంది. ముఖ్యంగా పెళ్లయిన ఎనిమిది సంవత్సరాలకి పుట్టిన పిల్లలపై పడుతుంది. పళ్ళలా రేపో, మాపో అన్న అత్తమామల పరిస్థితి ఆలోచిస్తు తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది. వారం రోజులయి దగ్గు, జ్వరంతో భాధపడుతున్న భర్త రామాన్ని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకు వెళితే అపోలో హాస్పిటల్ లో అన్ని పరీక్షలు చేసి డాక్టర్ పెద్దవారు ఉంటే రమ్మనమ్మ అని చెప్పినప్పుడు లేదండి మా అత్తగారు, మామగారు చాలా పెద్దవారు పరవాలేదు నాకు చెప్పండి అన్న వెంటనే తన ఛాంబర్లోకి రమ్మని కూర్చోమని భయం లేదు మీ వారి ఊపిరితిత్తులు సిగరెట్లు, మందు వల్ల సగానికి పైన పాడయిపోయాయి. బలమయిన ఆహారం, నేను ఇచ్చిన మెడిసిన్ ద్వారా రెండు నెలలలో ఆరోగ్యవంతులవుతారు. విశ్రాంతి రెండు నెలలు తీసుకోవాలని చెప్పగా కమలకు నోటమాట రాలేదు. అయినా ధన్యవాదాలు చెప్పి ఇంటికి కారులో వెళ్ళింది. వీథి గుమ్మం లో ఉన్న అత్తమామలకు పరవాలేదు, విశ్రాంతి మందులు తీసుకుంటే ఆరోగ్యం కుదుటబడుతుంది. అని చెప్పి రెండు నెలలు కంటికి రెప్పలా భర్తను చూసి తిరిగి డాక్టర్ గారు మీ వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పగా కుల దైవం వేంకటేశ్వరునికి నమస్కారం చేసింది. రాత్రి భర్త తనని గదిలో ఆప్యాయంగా కౌగలించుకొని సతీ సావిత్రి కథ విన్నాను కానీ, ప్రత్యక్షంగా చూసాను అని భాధతో, పశ్చాత్తాపంతో క్షమించమన్నప్పుడు మీరు మూడు ముళ్ళ బంధం తో నన్ను మీ దానిగా చేసుకున్నప్పుడు మన మధ్య క్షమాపణలు ఎందుకండి అన్నప్పుడు రామం వివాహా బంధం అన్ని బంధాలకన్నా అతి పవిత్రమైనది అన్న పెద్దల మాట అక్షర సత్యం అని ఆప్యాయంగా కమల నుదుటిపై ముద్దుపెట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!