మానవత్వం ఒక ప్రశ్నార్థకమా?

మానవత్వం ఒక ప్రశ్నార్థకమా?

ఎక్కడ మానవత్వం
నీవు రాసే రాతల్లోనా?
నీవు పలికిన మాటల్లోనా?
గంభీరంగా గర్జిస్తూ వేదికలపై
మైకుల ముందు ఇచ్చే సందేశాల్లోనా?
మరి ఎక్కడ మానవత్వం?

కామాంధుల వేటుకు
బలి అయిన ఆడపిల్లల
ఆక్రందనలల్లోనా?
నిరుద్యోగుల నిస్సహాయత
నిట్టూర్పుల ఎదురు చూపుల లోనా?
కడుపు కాలుతున్నా గంజి నీళ్లు
దొరకని అనాధ పిల్లల ఆకలి కేకల్లోనా?
కన్న పిల్లలున్నా పిడికెడు అన్నం లేక
నిలువ నీడ లేక ముసలి వయసు లో చేయి అందించు నా అన్న వారు లేని జీవితాలల్లోనా?
ఎక్కడ మానవత్వం?
మరి ఎక్కడ కనిపించనీ మానవత్వం?

నిజాలు తెలిసిన చెప్పలేని చేయలేని గాంధారి రాజ్యాన కనిపించలేదే మానవత్వం?
మట్టిలో మట్టిలా కలిసిపోయిందా?
నివురుగప్పిన నిప్పులో దాగి ఉందా?
ఇంత మంది ఉసూరు మన్న
కన్నీళ్ళ సముద్రగర్భంలో కలిసి పోయిందా?
లేక ఆ శకుని ఆడించే
పాచిక లాటలో పావుగా మారిపోయిందా ఈ మానవత్వం?

నాకు కనిపించని ప్రశ్నార్థకం ఈ మానవత్వం?
మానవ హృదయాలలో మసకేసిన మానవత్వమా ఎక్కడ నీ చిరునామా
మానవత్వమా మేలుకో మేలుకో……!

రచయిత :: జె.స్వయం ప్రభ.మధుమాస వీణ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!