ఏవో కొంచెం

ఏవో కొంచెం

రచన: కృష్ణకుమారి

వకుళ పక్కింటి జ్యోతి కనపడితే పలకరించింది. “ఏం,జ్యోతీ ఈసారిదీపావళికి ఎలా మరి”?

జ్యోతి అత్తగారు చనిపోయి రెండు నెలలయింది.  కర్మకాండలు అన్నీ జ్యోతి పెద్ద బావ గారింట్లో అందరూ చేసేరు.  అన్ని బాధ్యతలూ తీరిన తరవాత మరణం ఏమో ఆ పదిరోజులూ అయిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళి రొటీన్ లో పడ్డారు.

“ఏం చేస్తాం వకుళా!  మాకు ఈ ఏడాది అంతా పండగలు లేవు కదూ! ఏం చేయడం”

జ్యోతి చిన్న కొడుకు బుజ్జి అఖండుడు.  వాడికి వాళ్ళమ్మ చుట్టుపక్కల ఆడవాళ్ళతో మాడాడుతూ ఉంటే వినడం మహా ఇష్టం.

చటక్కున అన్నాడు. ” ఆంటీ, ఏవో కొంచెం చేగోడీలు మాత్రం చేసింది మా అమ్మ ! మరే కొంచెం సేమ్యా చేస్తున్నాది”

వకుళ మొహం చూడాలంటే భయం తో లోపలికి వెళ్ళింది జ్యోతి. వెనకాలే వెళ్ళిన బుజ్జాయి గాడి వీపు మీద రాత్రి పేలాల్సిన పటాకీలన్నీ పేలేయని వేరే చెప్పాలా?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!