పుడమి అంతా చిత్ర విచిత్రాల కలయిక

(అంశం::”చిత్రం భలారే విచిత్రం”)

పుడమి అంతా చిత్ర విచిత్రాల కలయిక 

రచన:: జె వి కుమార్ చేపూరి

విధాత సృష్టి ఎంత చిత్రం భళారే విచిత్రం
సృష్టిలోని ఎన్ని కోట్ల వృక్షాజంతుజాలం
అయినా రంగు, రూపు, పత్రం, పుష్పం, ఫలం
ఆకారాలలో ఒకదానికికొకటి పూర్తిగా భిన్నం
తీయగున్నా ఫలాలన్నీరుచిలో పూర్తి బిన్నం

ఒకటే అయినా మనుషుల ప్రాణం
ప్రవర్తనలు మనిషి మనిషికి భిన్నం
అయితే మనసుకు మాయని గాయం
కన్నీరు కార్చే నేత్రం కాదా చిత్రం భళారే విచిత్రం
బొటనవ్రేలు అందరిదీ ఒకటే అయినా
వేలిముద్రలు ఒకదానికొకటి పూర్తిగ భిన్నం

వృక్షాజంతుజాలాల దేహ నిర్మాణ క్రమం
అది నిరంతరం అలుపెరుగక పనిచేయడం
అనిపించక తప్పదు చిత్రం భళారే విచిత్రం
పీల్చే నీరు తినే తిండి ఒకటే అయినా
రంగురూపాల్లో ఒకరికొకరు భిన్నం

కన్న తల్లిదండ్రులు ఒకరే అయినా
పెరిగిన వాతావరణం ఒకటే అయినా
పిల్లల ఎత్తు,రంగు రూపు, వర్ణం భిన్నం
చెప్పుకుంటూ పోతే చాంతాడంత పట్టిక
పుడమి అంతా చిత్ర విచిత్రాల కలయిక

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!