అక్కుపక్షి

అంశం: మనస్సాక్షి

అక్కుపక్షి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎం వి. ఉమాదేవి

మాటిమాటికీ తొంగిచూడకే మనస్సాక్షి
లాభం నష్టం బేరీజుల్లో నిండి ఉన్నానే అక్కుపక్షీ !
సాయం చేసినవాళ్ళు నేడు కష్టంలో ఉంటేచూడూ
ఉపయోగం ఉంటే నువ్వూ సాయం చేసేయోచన నేడు!!

సుమతి, వేమన శతకమంజర్లు
కలియుగంలో పనికొచ్చేనా
తాడో పేడో నేడే తేల్చే వేడుకిపుడేనా
మౌనంగానే బుద్ధీ చేతనజ్ఞానం జ్యోతి వెలిగిద్దాం
కాలం తీరుకు కొంత విచారణ చేసే సాగుదాం!!

మనస్సాక్షిని అణగదొక్కి మనం నిద్ర పోలేం సోదరా
ధర్మ న్యాయపరమైన సూత్రం ఒకటుంది కదరా
దానివెంట సాగుదాం ధన్యత పొందగా
సాదాసీదా పుణ్యం మనబోటి వాళ్ళదేగా!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!