కనిపించని కన్ను

అంశం: మనస్సాక్షి

కనిపించని కన్ను
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

మనము చేసే మంచయినా, చెడయినా
మనము చేసే మేలైన, కీడైన,
హెచ్చరించే కన్నొకటి ఎల్ల వేళల గమనించు,
మనమే మనకు సాక్షిగా, మనసే మనకు సాక్షిగా
ఏ కార్యాలొనరించిన హెచ్చరించు మనస్సాక్షి.
స్వార్థంబుతో దారితప్పిక, స్వలాభమునే తలవక,
అన్యాయంగా నడవనీక, బాధ్యతలు మరవనీక,
నిర్మల మనస్సుతోడ, మంచిని విడనాడక,
మర్యదను జవదాటనీక, బంధాలను మరువనివ్వక,
నడవమని బోధించు, మనస్సాక్షి ఒకటుంటుంది.
కనబడని కన్నొకటి ఉంటుది,
ఎల్ల వేళల చూస్తూనే ఉంటుంది,
క్షణక్షణం హెచ్చరించే శ్రేయోభిలాషి,
అదే మనస్సాక్షిని మించిన మిత్రుడు లేడు,
అది చెప్పినట్టు విన్నావో నీ బ్రతుకు,
నల్లేరు మీద నడకగును నిజము,
పదిమందికి మేలుచేస్తు
మంచిగ మనమని చెప్పే మహామనిషి
అదే మన మనస్సాక్షి అది చెప్పినట్టు వింటే
మన బ్రతుకే పూలవనం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!