మానవత్వం పోలేదు

మానవత్వం పోలేదు

రచన::సుజాత

వారానికి ఒక రోజు అంగడి పెడతారు ఈ రోజు మా కాలనీలో అంగడి చాలా సందడిగా వుంది కిక్కిరిసిన జనాలతో సందడి సందడిగా ఉంది ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు కరోన అని తెలిసినా ఏ ఒక్కరికి భయం లేదు మీద మీదనే పడుతు గలాభ చేస్తున్నారు
ఏ ఒక్కరికీ మాస్కులు లెేవు

ఈ రోజు అమావాస్య బతుకమ్మ పండుగ కద అందుకే కాబోలు అంతా సందడిగా ఉంది ఆ అంగడిలోనెే మనకు కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి మళ్ళీ మనం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు పిల్లలు పెద్దవాళ్లు అందరూ వస్తున్నారు పిల్లలు గాజుల దగ్గర
ముచ్చటపడుతూ అన్నీ చూస్తూ వాళ్ల కావలసిన మ్యాచింగుల కొరకు హైరానా పడుతూ వెతుకుతున్నారు వాళ్లకి ఏవి అంతగా నచ్చడం లేదు
వాళ్ళ మొహాల్లో నిరాశ కనబడుతుంది.మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం ఇక్కండెే ఏవో ఒకటి తీసుకుందాం లేవే వాళ్లలో వాళ్లే అనుకుంటున్నారు.

బతుకు బండి నడవాలంటే ఏదో ఒక పని చేయక తప్పదు ప్రొద్దున లేచిన మొదలు రాత్రి పడుకునేవరకు ఏదో ఒకటి కష్టపడుతూనే ఉండాలి కష్టపడందే పొట్ట గడవదు రెక్కాడితేగాని పూట గడవదు కొందరి జీవితాలు అంతే కొందరికి తిండీ బట్ట ఉన్నా కూడా మనశ్శాంతి లేక కంటినిండా నిద్రలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు అలాంటి వారికి ఎంత ఉన్నా ప్రయోజనం లేదు.

ఎన్నో సమస్యలతో బతుకు భారంతో చెప్పుకోలేని బాధలతొో తిండిలేక అవస్థలు పడుతూ బతుకు భారాన్ని వెల్లదీస్తున్నారు మరి కొందరు సమస్యలే లేనట్టు కరోనా ఒకటి కొందరి జీవితాలను అతలాకుతలం చేసి ఎన్నో ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి.

ఇది ఇలా ఉండగా రోజు కూలీ చేసుకునే వారికి ఇదొక పెద్ద సమస్య వారి సమస్యను తీర్చే వారు లెేరు అంతా అగమ్యగోచరం ఆదుకునేవారు లేక దిక్కులేక రోడ్లపై పడ్డారు ఎంతో మంది అభాగ్యులు కాంతయ్య తన కొడుకు ఫీజు కట్టలేక తన దుస్థితికి బాధపడుతున్నాడు తనలాగే తన కొడుకు బాధపడకూడదని ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు ఈ కరోనా మూలంగా డబ్బులు వెళ్లక ఫీజు కట్టలేదు పని చేయాలన్న లాక్డౌన్ వలన పని లేదు తన కూరగాయల బండి పెట్టుకోడానికి వీలు లేకుండా పోయింది.

ఇప్పుడిప్పుడే లాక్డౌన్ ఎత్తివేశారు కానీ అంతంతమాత్రంగానే నడుస్తుంది ఫీజు కు సరిపడే డబ్బులు దొరకాలంటే చాలా కష్టం తన కొడుకుకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు చేతిలో చిల్లిగవ్వ లేదు
తన భార్య నగలు అమ్ముదామన్నా ఎవరూ తీసుకోవడం లేదు మాకెే పనులు లేక అవస్థలు పడుతున్నాం మా దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అంటూ ఎవరు తీసుకోవడం లేదు.తన కొడుకు ఫోన్ చేస్తున్నాడు. నాయనా డబ్బులు అందడం లేదు ఇంకొక రెండు రోజులు అగుతావా అంటూ తన బాధను చెప్పాడు సరే అయ్యా అన్నాడు.

తన తండ్రి బాధను చూసి మనసు చలించిపోయింది తక్షణమే తన ఊరికి వచ్చాడు తన కొడుకును చూసి ఎందుకు వచ్చావని అడిగాడు.చదువులన్నీ బంద్ పెట్టారు కాదయ్యా అందుకే వచ్చాను నేనిక్కడే కొన్ని రోజులు ఉంటాను అన్నాడు ఫీజు కట్టలేదని బాధపడుతున్నావా నాయనా అదేం లేదు అయ్యా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కడతాను
చదువుకోవాలని ఉన్నప్పుడు ఇప్పుడైనా ఫీజు కట్టొచ్చు అయ్యా అన్నాడు.అయ్యా నువ్వు ఇంటికాడనే ఉండు అంటూ తన ఫ్రెండ్ దగ్గర కొంత డబ్బు అప్పుగా తెచ్చి చిన్నగా పండ్ల వ్యాపారం పెట్టాడు ఇంక నీవు ఇంట్లో వుండు అయ్యా నెేను అమ్ముతాను అన్నాడు అయ్యో నాయనా నీ కెందుకీ అవస్థలు నీకు అలవాటు లేదు కద బాధపడుతూ అన్నాడు ఏం ఫర్వాలేదు అయ్యా నేను అమ్ముతాను అనగానే .అలా చూస్తుండిపోయాడు ఏం చేయలేక అంగడికి వెళ్లి తన బండిని పెట్టాడు.

మనసులో మనకేదైనా చేయాలన్నప్పుడు ఎంత కష్టమైనా చేయగలుగుతాం అన్నది తాత ద్వారా తెలుసుకున్న సత్యం.అటు లాక్డౌన్ ఎత్తేయడం ఇటు బతుకమ్మ పండుగ కావడంతో కిక్కిరిసిన జనాలతో ఉన్నారు. ఇప్పుడు కొద్దికొద్దిగా బాగానే నడుస్తోంది వ్యాపారం ఏం నాయనా ఈ పండ్లు ఎలా ఇస్తున్నావు అంటూ అడిగాడు ఒక పెద్దమనిషి యాభై రూపాయలకు డజన్ అని చెప్పాడు సరే అంటూ తనకు కావలసిన వస్తువులు చెప్పాడు తను చెప్పినవి ప్యాక్ చేసి ఇచ్చాడు డబ్బులు ఇస్తూ బాబు వంక చూశాడు.ఏం నాయనా నిన్నెక్కడో చూసినట్టుగా వుంది
అన్నాడు తన కంటి అద్దాలను సవరించుకుంటూ అన్నాడు అవునా అంటూ తనవైపు చూసాడు బాబు గుర్తు పట్టి అయ్యో సార్ నేను మీ స్టూడెంట్ గిరిబాబు నీ అన్నాడు సంతోషంతో నమస్కారం సార్ అంటూ ఏంటి నాయనా చదువు ఆపేసి ఇలా అమ్ముతున్నావు అన్నాడు.

ఏం చెప్పమంటారు సార్ మాలాంటి మధ్య తరగతి కుటుంబాల గురించి తను బాధపడుతూ
చెప్పుకొచ్చాడు ఇప్పుడు అన్నీ ఆన్ ఆన్లైన్ క్లాసులే కదండీ నా దగ్గర సెల్ఫోన్లు ల్యాప్టాప్లు లేవండి అవన్నీ కొనాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి మా దగ్గర అంత డబ్బులు లేవు మా నాన్నది చిన్న పండ్ల వ్యాపారం మాకు ఇల్లు గడవడమే చాలా కష్టం అందులో నన్ను కష్టపడి చదివిస్తున్నాడు.కరొోన మూలంగా మా వ్యాపారం దెబ్బతిన్నది.మేము చాలా చితికిపోయాం మా కుటుంబ భారం నాన్నకు ఎక్కువైంది.

మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని నన్ను చదివించారు నాన్న బాధపడుతుంటే నేను చూడలేక పోయాను అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను సార్ చదువంటారా ఈ సంవత్సరం కాకుంటే వచ్చేసంవత్సరం పరీక్షలు రాస్తానండి నీ విజ్ఞతకి చాలా సంతోషం బాబు మా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని నా అభిప్రాయం సార్ కొద్దిలో కొద్దిగా నైనా మా నాన్న మోసే బతుకుబండి లో నా వంతు నేను చేస్తున్నాను సార్ ఇదిగో నండి మిగితా డబ్బులంటూ ఇవ్వబోయాడు వద్దు బాబూ ఉండని అన్నాడు వద్దు సార్ మీరు ఇలాగే ఇస్తే నాలో బద్ధకం ఏర్పడుతుంది.

కష్టపడాలనెే ఆలోచన మారుతుంది ఎవరైనా ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది కష్టపడాలనెే ఆలోచన నాకు ఉండనివ్వండి సార్ బాబు నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను చదువు చెప్పిన విద్యార్థి ఈలా మారడం చాలా గొప్పగా ఉంది గర్వంగా కూడా ఉంది నీలా అందరూ ఇలాగే ఉంటే దేశం గర్విస్తు౦ది.బాబు చల్లగా ఉండు అంటూ దీవించి వెళ్లాడు.ప్రతీ తండ్రి కొడుకు ఇలా తండ్రి కష్టాన్ని గుర్తిస్తే ఏ కుటుంబంలో బాధలుండవు బాధ్యతలు అందరికీ తెలుస్తాయి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!