అసలుకి ఎసరు

అసలుకి ఎసరు

రచన:: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

శ్రీజ నిచ్చెనేసుకొని డాబా మీదకెక్కి భర్త కార్తీక్ కోసం చూస్తూ ఉంది.కార్తీక్ ఎంత సేపటికీ రాకపోవడంతో అలిగి కిందికెళ్ళి మంచంపై పడుకొనేసింది.కాసేపటికి వచ్చిన కార్తీక్ మంచంపై ఉన్న శ్రీజని చూసి “శ్రీజా..!లే …నీకోసం ఏం తెచ్చానో చూడు”అన్నాడు.అలుగు అటకెక్కించి చివుక్కున లేచి ఏం తెచ్చావ్ అంది.కార్తీక్ ఇదిగో అంటూ ఓ పట్టు చీర చూపించాడు.శ్రీజ నిరాశతో “చీరా..నేనేదో బంగారు హారమనుకున్నాలే”అంటూ నిట్టూర్చడంతో కార్తీక్ కి చాలా బాధేసింది.”ఉద్యోగం లేక ఇన్ని రోజులు ఇబ్బందులు పడ్డాం.ఇప్పుడేదో ఒక ఉద్యోగం వచ్చింది దాంతో సంతృప్తి పడకుండా ఆశలు కోటలు దాటితే ఎలా” అంటూ శ్రీజ మొహం మీదే అడిగేసి అన్నం తినకుండా పడుకొనేశాడు.శ్రీజ ఆలోచించి కార్తీక్ కి నేనంటే ఎంత ఇష్టం లేకపోతే తన తొలి జీతంతో నాకు చీర తీసుకొస్తాడు అని అనుకూలం గా ఆలోచిస్తూ “కార్తీక్..!లే అన్నం తిను” అనడంతో కార్తీక్ ఇంకొంచెం బెట్టు చూపించాడు.శ్రీజ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో మా ఆడాళ్ళకి తెలినట్లు ఎవ్వరికీ తెలియదు అనుకుంటూ కార్తీక్ పక్కన పడుకొని నెమ్మదిగా నడుం పై చెయ్యేసింది.కార్తీక్ విదిలించేయడంతో గట్టిగా హత్తుకోవడంతో లేచి కూర్చునేశాడు.అన్నం పెట్టనా అంటూ శ్రీజ పళ్ళెంలో అన్నం పెట్టుకొని నోట్లో ముద్దుల ముద్దలు పెడుతూ ఉంటే కార్తీక్ కడుపు చెరువై అమాంతం మింగేస్తూ ఉంది.శ్రీజ పరువాలు పైకి దర్శనమిస్తుంటే గోడకంటించిన చిత్రాలు విచిత్రంగా సిగ్గుపడుతున్నాయ్.కార్తీక్ నిస్సిగ్గుగా తన పని కానించేస్తుంటే శ్రీజ తనని అర్పించుకుంది.

ఒకరిపై ఒకరికి ప్రేమైశ్వర్యం మెండుగా ఉన్నా సంపాదనే కరువని శ్రీజ బాధ.కార్తీక్ కూడా తన శక్తిమేరకు ప్రయత్నిస్తూ సంపాదిస్తూనే ఉన్నాడు. అయినా బారెడు ఆశకి మూరెడు జీతం ఏపాటి.పేపర్లో ఓ ప్రకటన శ్రీజ కంట పడడంతో కార్తీక్ ని పిలిచి “ఏమండీ ఒక ఉద్యోగం ఖాళీ ఉందని పేపర్లో చూశాను.ఇంటర్వ్యూకి వెళ్ళండండి ప్లీజ్ అంటూ బతిమాలింది.కార్తీక్ ఒకే దగ్గరుంటే జీతం పెంచుతారే అంటున్నా శ్రీజ వినిపించుకోలేదు.వెళ్ళాల్సిందేనంటూ పట్టుబట్టడంతో కార్తీక్ కి వెళ్ళక తప్పలేదు.ఇంటర్వ్యూ కి వెళ్ళి వచ్చాడు.కానీ వాళ్ళు ఫలితాన్ని తెవల్చలేదు.
ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ వారికి ఇంటర్వ్యూకి అటెండయిన విషయం తెలిసిపోవడంతో ఉద్యోగంలోంచి తీసేశారు.కార్తీక్ బతిమాలినా ఆ కంపెనీ మేనేజర్ కనికరించలేదు.దిగులుగా ఇంటికి చేరిన కార్తీక్ కోపంతో శ్రీజ ను తిట్టాడు.శ్రీజ “బాధపడకండి ఇంటర్వ్యూలో సెలెక్టవుతారులే “అంటూ ఓదార్చింది.అనుకున్నదొకటి అయినదొకటి చందంగా
ఉన్నది పోయె ఉంచుకున్నదీ పోయె.అసలుకి ఎసరొచ్చి కొత్త ఉద్యోగం కార్తీక్ కి రాలేదు.దురాశ దుఃఖానికి చేటు అనుకుంటూ కార్తీక్ మళ్ళీ ఉద్యోగాల వేటగాడై కాళ్ళరిగేలా తిరగుతున్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!