(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
ఆకాశమంత ప్రేమ
రచయిత :: జయకుమారి
నా మనస్సు తలుపు తెరచి
మాయగా నన్ను చుట్టేసి.
నాలోకాన్ని మొత్తం మార్చేసి..
తీయని గాయమై.
నను తాకి వేదిస్తుంటే.!
నిను విడిచి వెళ్ళలేక..
బంధమై కలిసి ఉండలేక.!!
నిను ముల్లునై బాధించలేక
పువ్వునై చెలిమి ని పంచలేక.!!
నిను చేరుకోవలెనే ఆశలకు కళ్ళెం వేయలేక.
ఆకాశం అంత నీ ప్రేమకు నిచ్చెన వేయలేక.!!
నీ జ్ఞాపకాలన్నీ నా మదిన నింపుకొని..
మౌనమై అమావాస్య నిశినై కనుమరుగు అవ్వాలా.!!
అర్ధం కాని ఈ వింత బంధనంలో గమ్యం తెలియని బాటసారి గా మిగిలిపోవలా.!!