అమ్మ కాసేపు ఆగు

(అంశం:: “అర్థం అపార్థం”)

అమ్మ కాసేపు ఆగు

రచన:: ఎన్.ధన లక్ష్మి

కామాక్షీ అమ్మాయీ రెఢీ అయింది లేదా?? పెళ్లి వారు వచ్చే వేళ అయింది…
అయింది అండి.మీరు హడావిడి పడకుండా కాస్త కుదురుగా ఉండండి ఈ మజ్జిగ తీసుకోండి అని విశ్వం చేతికి గ్లాసు ఇచ్చారు కామాక్షీ.
మన అమ్మాయీకి సరైన పెళ్లి సంబంధం.ఇది కనుక సెట్ అయితే మన బిడ్డ సంతోషంగా ఉంటుంది.
మనకు సెట్ ఎందుకు కాదు అండి చిన్నప్పటి నుంచి మనం అనుకున్న సంబంధం కదా పైగా మీ ప్రాణ స్నేహితుడి కొడుకు.
నిజమే కావచ్చు కాకపోతే అబ్బాయీ ఇప్పుడు అమెరికా లో ఉండి వచ్చాడు కదా.మన అమ్మాయీ నచ్చుతుందా లేదొ అని అనుమానం.
మన అమ్మాయీ ఎందుకు నచ్చదు అండి.మన ఇంటి మహాలక్ష్మి  అండి.
చూద్దాము కామాక్షీ.
వీరి సంభాషణ మొత్తం విన్నది రూమ్లో ఉన్న లత
రూంలో కూర్చొని బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు ఎలాగ అయిన నా మనసులో మాట నాన్నకు చెప్పాలి అని ధైర్యం తెచ్చుకొని ” నాన్న గారు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు.నాకు ఎమ్మెస్ చేయాలని ఉంది .నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది అని తన మనస్సులోని మాటను ధైర్యంగా చెప్పింది.నేను MS చేసి, జాబ్ తెచ్చుకొన్న క్షణం మీరు ఎవరిని చూపించిన సరే నేను వివాహం చేసుకోవడానికి సిద్ధం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాన్న.
చూడు తల్లి ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగా ఉంటుంది .
అది కాదు నాన్న ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించి చెప్పండి ప్లీజ్ నాన్న..
నువ్వు పెళ్లి చేసుకుంటాన్నావు అంతే ఇది ఫైనల్  నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు అని గట్టిగా మాట్లాడడంతో లత సైలంట్ అయింది ..
పెళ్లి వాళ్ళు రావడం,వాళ్లకి లత నచ్చడం పెళ్లి తేదీని  ఫిక్స్ చేయడం అని చకచకా జరిగిపోయాయి.
రెండు రోజుల తరువాత లతని కలవడానికి తన ఫ్రెండ్ సుమ వచ్చింది
” కంగ్రాచ్యులేషన్ లత ఢిల్లీ యూనివర్సిటీలో నీ
సీట్ కన్ఫర్మ్ అయింది. నీ కల  నెరవేరబోతోంది..
ఏమైంది లత నేను గుడ్ న్యూస్ చెప్పిన ఎందుకు నువ్వు డల్ గా ఉన్నావు????
తనకి ఫిక్స్ చేసిన పెళ్లి గురించి ,తనకి వాళ్ళ నాన్నకి
మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా చెప్పింది.
” చూడు లత ఇది నీ జీవితం పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ ఉమెన్ గా ఉండి పోవాలి.నీకంటూ ఏ గుర్తింపు అనేది ఉండదు. నీ లైఫ్ నీ చేతిలో ఉంది ఇంకా నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది.లత ఆలోచనలో పడింది .
సుమ చెప్పింది నిజం.నా జీవితం ఇప్పుడు నా చేతిలోనే ఉంది.పెళ్ళిది ఏమి ఉంది.ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు.వెళ్లి పోవడానికి ప్లాన్ వేసుకొంది..
తనకు సంభందించిన వస్తువులను ఇంటి వెనుక ద్వారా  సుమ చేతికి ఇచ్చి పంపించి వేసింది
అమ్మ నేను  బ్యూటీపార్లర్ కి   వెళ్లి  వస్తాను అమ్మ
కాసేపు ఆగు లత ఈ డబ్బు తీసుకొని నీకు నచ్చిన వస్తువులు ఏమైనా తీసుకో అని తన ఏటీఎం కార్డ్ ఇచ్చారు విశ్వం.
ఆ మాట వినగానే తన నాన్న ప్రేమ ను చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి లతకి.
నీతో ఓ విషయం చెప్పాలి అమ్మ
అమ్మో! నేను ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే నాన్న ప్రేమ ను చూసి నా నిర్ణయం  మార్చేసుకుంటాను అని మనసులో అనుకొని  నాన్న నేను అర్జెంట్ గ పార్లర్ కి వెళ్లాలి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు.
అయితే త్వరగా ఇంటికి రా అమ్మ నీకు ఒక మాట చెప్పాలి అన్నారు విశ్వం.
సరే నాన్న!
ఢిల్లీకి వెళ్లి పోయి హాస్టల్ చేరిపోయింది. సుమ ఏమో పై చదువులకు లండన్ వెళ్ళిపోయింది.ఇంటికి ఫోన్ చేయాలి అంటే తనకు ధైర్యం సరిపోలేదు.తన బంధువులకు ఎవరికి ఫోన్ చేసిన తనని తిడతారు అని ఫోన్ చేయడం  మానేసింది
తన డైలీ లైఫ్ లో బిజీగా మారిపోయింది.
కొద్ది రోజులు అయిన తరువాత ఇంటికి ఫోన్ చేసింది  రింగ్ అవుతుంది తప్ప ఎవరూ తీయడం లేదు…. అలా చాలా సార్లు చేసింది… కొద్ది రోజులు అయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఆన్సర్  వచ్చింది.

నేను గోల్డ్ మెడల్ తీసుకొని ఇంటికి వెళితే నాన్న కు నా మీద కోపం ఉండదు అని ఆలోచించి…బాగా చదవి ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది.తను అనుకున్నట్టు గోల్డ్ మెడల్ తీసుకుంది.తన పేరు  ప్రతికలో పడింది..
ఎంతో సంతోషంగా, గర్వంగా ఇంటికి వెళ్ళింది.డోర్ బెల్ కొట్టడానికి లత చేతులు వణుకుతున్నాయి…
డోర్ బెల్ కొట్టగానే ఎదురుగ ఉన్న వాళ్ళ
మామయ్యని చూసి షాక్  అయింది. భయపడుతూనే మామయ్య నాన్న ఎక్కడ ఉన్నారు…
అతను ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు…
మామ నా మీద మీకు కోపం ఉంది అని తెలుసు.
నా భవిష్యత్ కోసం తప్పలేదు.నేను యూనివర్శిటీ ఫస్ట్ వచ్చాను.నా పేరు కూడా పేపర్ లో పడింది. చూడండి కావాలంటే అని తన పర్సు ఓపెన్ చేయ బోయింది.
నీ పేరు  చాలా రోజుల ముందే పడింది అమ్మ పత్రికలో పారిపోయిన విశ్వం మాస్టర్ గారి కూతురు అని  పేపర్ లత మొహం పై వేశాడు…
లత తన  క్లాస్మేట్ సహాయంతో ఢిల్లీ కి వెళ్ళింది.తను థాంక్స్ చెప్పుతూ అతనిని హగ్ చేసుకొంది ఆ పిక్ నీ ఎవరో తీసి పేపర్లో వేశారు . లతా ఏడుస్తు మామయ్యా ఇదంతా అబద్ధం. అతను నా ఫ్రెండ్.
నాన్న ఎక్కడున్నాడు చెప్పండి . ఇదంతా నాన్నకి చెప్పాలి . నాన్న నాన్న అని  లతా పిలుస్తుంటే వాళ్ల మామయ్య  ” మీ నాన్న గారు కావాలి  కదా దా ఒక రూం లోకి తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళ నాన్న గారి ఫోటో కి దండేసి ఉంది. నాన్న చనిపోయారు .
బావకి క్యాన్సర్ తను చనిపోతున్నారు అని తెలిసీ నీకు మంచి భవిష్యత్ ఇవ్వాలని భావించి నీకు పెళ్లి చేయాలని అని నిర్ణయించారు .తను బ్రతికి వుండగానే నీ పెళ్లి చూడాలని భావించారు కానీ నువ్వు నీ స్వార్థం కోసం పెళ్లి కొద్దీ రోజులు ఉంది అనగా వెళ్లి పోయావు…
ఎవరో మీరు గిట్టని వాళ్ళు పేపర్లో  నీ ఫోటోను వేసి మీ నాన్న పరువును తీసారు.
పెళ్లి వారు , ఇరుగుపొరుగు అన్న మాటల వల్ల మీ నాన్న గారు గుండె నెప్పితో త్వరగానే చనిపోయారు.దీనికి కారణం నువ్వే ..
లత కింది పడి  క్షమించు నాన్న అని గట్టిగ గుండెలు పగిలేలా ఏడిచింది …
కొద్ది సేపు అగి అమ్మ ఎక్కడ మామయ్య…
ఇక్కడ అంటు వాళ్ళ అమ్మ వచ్చి లతను కొట్టింది..
ఆ రోజు మీ నాన్న గారు త్వరగా రామన్నరు కదా ఎందుకో తెలుసా…???
పెళ్లి వారితో మాట్లాడాను..పెళ్లి అయిన తరవాత నువ్వు  చదవుకోవడనికి ఏమి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అని… నువ్వు మీ నాన్న ప్రేమను అర్థం చేసుకో లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిన ప్రతి కోరికను తీర్చిన మీ నాన్న ఒక్క నీ చదువు ఎందుకు వద్దన్నాడు అర్థం చేసుకోలేదు. అపార్థం చేసుకుని  నీ పాటికి నువ్వు నిర్ణయం తీసుకుని వెళ్లిపోయావు.
ఆ రోజు కాసేపు ఆగి ఉంటే ఇంత అనర్థం  జరగకుండా ఉండేది కదా అంటు ఆవిడ ఏడ్చారు…
లత వాళ్ళ నాన్న ఫోటోని బాధ గా చూస్తూ
మెడలో ఉన్న గోల్డ్ మెడల్ ని  ఫోటో వద్ద ఉంచి దీని ఖరీదు మీ ప్రాణం నాన్న అని గుండె పగిలేలా ఏడ్చింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!