మాట అనే ముందు కొంచెం ఆలోచన ఉండాలి

(అంశం:: “అర్థం అపార్థం”)

మాట అనే ముందు కొంచెం ఆలోచన ఉండాలి 

రచన:: పావని చిలువేరు

ఒక వీధిలో  అన్ని రకాల వాళ్లు ఉండేవారు కాని ఉపాధ్యాయులు మాత్రం చాలా యెక్కువగా ఉండేవారు.
గూర్ఖా వాళ్ల కుటుంబం కూడా ఉండేది. గూర్ఖా వాళ్ళది పెద్ధ కుటుంబం.

సాయంకాలం అవ్వగానే ఆ వీధి లోని అరుగుల మీద పిల్లలు కూర్చుని స్కూల్లో యిచ్చిన హోం వర్క్ చేసుకునేవారు.
కొంత మంది పిల్లలు ఆ వీధి లో ఉన్న ఉపాధ్యాయుల దగ్గరకు వచ్చి హోంవర్క్ చేసుకునేవారు.

స్కూల్ నుంచి వచ్చిన తరువాత  సాయంకాలం 4.30 నుంచీ 6 వరకు చదువుకోవడం ,ఆ  తరువాత అందరూ కలిసి ఆడుకోవడం ప్రతి రోజూ జరిగేది.

సాయంకాలం కొంత మంది  మహిళలు బాతాకాని పెట్టుకునే వారు.

గూర్ఖా వాళ్లది పెద్ధ కుటుంబం చాలా మంది పిల్లలు ఉండేవారు.
వాళ్ల పూర్వికులు యెప్పుడో నేపాల్ నుండి వచ్చి యిక్కడ స్థిరపడ్డారు .

సాయంకాలం అవ్వగానే   ఆ వీధిలో పిల్లల సందడి చూసి గూర్ఖా వాళ్ల పిల్లలు కూడా వీధి లో ఉన్న పిల్లలతో ఆడుకునేందుకు బయటకి వచ్చేవాళ్లు . కాని యెవ్వరు వాళ్లతో ఆడుకొనేవారు కాదు .

కాని రోజు పిల్లల కోసం గూర్ఖా పిల్లలు  సాయంకాలం బయటకు వచ్చేవారు. చూడడానికి పిల్లలు మంచి రంగుతో, దృఢమైన వెంట్రుకలతో , పాతవి అయినా నిండుగా  చిరగని  దుస్తులు వేసుకునేవారు.

అలా రోజు సాయంకాలం బయటకి రావడం వీధిలో పిల్లలు గూర్ఖా పిల్లలతో ఆడకపోవడం ,చూసి చూసి  గూర్ఖా పిల్లలు వెళ్లి పోవడం జరిగేది.

ఒక రోజు వీధిలోని మహిళ గూర్ఖా  పిల్లలని పిలిచి  మా బంగ్లా పైనా వూడుస్థావా  అని అడిగింది.  వాళ్లలో ఒక అమ్మాయి సరే అన్నట్టుగా తల ఊపిoది . గూర్ఖా పిల్లలకు తెలుగు అంత బాగా మాట్లాడడం రాదు కాని కొంచెం అర్థం అవుతుంది.

సరే అయితే రేపు ఆదివారం 10.30 కి రా అని చెప్పింది.

తెల్లవారి  ఆదివారం 10.30 కి గూర్ఖా వాళ్ల అమ్మాయి వచ్చి,
మేడం అని  పిలిచింది . ఆ ఇంటి లోని మహిళ బయటకి వచ్చి ఆ అమ్మాయి చేతికి చీపురు యిచ్చి బంగ్లా మరియు మెట్లు కూడా వూడువుమనీ చెప్పింది .

ఆ అమ్మాయికి కొంచెం అర్థం కానట్టు అనిపించడంతో  6 వ తరగతి చదువుతున్న చింటుని పిలిచి హిందీ లో ఆ అమ్మాయి కి చెప్పమని అడిగింది.
సరే అని చింటు ఆ అమ్మాయితో బంగ్లా  పైకి వెళ్లి యెక్కడా యెక్కడా  వూడువాలి  అంత చెప్పి అక్కడే ఒక మూలన కూర్చొని  తన స్కూల్ హోం వర్క్ చేసుకుంటున్నాడు .
పని చేసుకుంటూ ఆ అమ్మాయి ఆ అబ్బాయి తో మాట కలిపిoది .

అలా కొంచెం పరిచయం ఏర్పడింది.
తెల్లవారి అందరూ స్కూల్ కి వెళ్ళి వచ్చిన తరువాత మళ్లీ పిల్లలందరు హోంవర్క్ చేసుకోవడం,  తరువాత ఆడుకోవడం  జరిగేది , చింటు తన స్నేహితులకి  చెప్పడం వల్ల గూర్ఖా పిల్లలతో  కూడా కలిసి ఆడుకునేవారు .

గూర్ఖా అమ్మాయి చింటు వాళ్ల అమ్మ… ఏ పని చెప్పిన చిటికలో చేసేది . యీ అమ్మాయి చాలా బాగా పని చేస్తోంది అని ఆ వీధి లో కొంత మంది మహిళలు చిన్న చిన్న పనులు చెప్పేవారు .
అలా రోజు పొద్దున కొంతమంది ఇంటి ముందు ఊడువడం , ముగ్గు పెట్టడం చేసేది .

పొద్దునే అందరూ పిల్లలు స్కూల్ కి ఆటో లో వెళ్లడం చూస్తూ ఉండేది. ఆ పిల్లలు వచ్చేవరకు యెదురు చూస్తూ ఉండేది.

చింటుతో పరిచయం బాగా పెరిగింది.
యెప్పుడూ చింటు చదువుకున్న  బయట ఇటూ అటూ తిరుగుతూ ఉండేది.

అలా రోజు ఆ అమ్మాయి చింటు వాళ్ల ఇంటి ముందు అలా  తిరుగుతూ ఉండడం చూసి వయసు చిన్నది అని కూడా ఆలోచించకుండా  తప్పుగా అనుకోని ఆ అమ్మాయి తో మాట్లాడ వద్ధు అని చింటు కి చెప్పడం,  ఆ అమ్మాయి వీధిలోకి వస్తే కోప్పడేవారు.

వయసు లో చిన్నది అవడం వల్ల అమ్మాయి కి యేమీ అర్థం కాక మళ్లీ మళ్లీ పిల్లల కోసం బయటకి  వచ్చేది.

చూసి చూసి చింటు వాళ్ల అమ్మ, చింటు వాళ్ల నాన్నగారితో  చెప్పడం అన్ని జరిగి పోయాయి.

కానీ చింటు వాళ్ల నాన్న తప్పు చేస్తున్నవని  ఆడదానివి అయివుండి  చిన్న అమ్మాయినీ  అలా  నిందిoచడం తప్పు అని చెప్పి,  రేపు ఆ అమ్మాయి పిలువు నేను మాట్లాడుతాను అని చెప్పాడు .

తెల్లవారిoది  అందరూ పిల్లలు స్కూల్ కి వెళ్లడం జరిగింది.  ఆ సమయంలో  ఆ అమ్మాయిని పిలిచి చింటు వాళ్ల నాన్న మాట్లాడడం  మొదలు పెట్టారు .

యెందుకు అమ్మాయి నువ్వు ఆడుకునే సమయంలో వచ్చి ఆడుకోవాలి కాని  ,పిల్లలు స్కూల్ నుంచి వచ్చి హోం వర్క్ చేసుకునే సమయంలో అలా యెందుకు  ఇంటి ముందు తిరుగుతున్నావు అని అడిగారు.

అప్పుడు ఆ  అమ్మాయి కొంచెం తెలుగు లో కొంచెం హిందీ లో చెప్పిన మాటలు విని చింటు వాళ్ల అమ్మ కళ్లలో  నీళ్లు తిరుగాయి .

ఆ అమ్మాయి చెప్పిన మాటలు  యేమిటో తెలుసా.
నాకూ చదువుకోవడం  అంటే చాలా ఇష్టం,  మేము  చాలా మందిమీ అవడం వల్ల అందరం చదువు కోవడం  కుదరదు అని ,
పిల్లలు అందరూ స్కూల్ నుంచిన తరువాత అందరూ పిల్లలు చదువుకుంటూ ఉంటే,  నాకూ విని నేర్చుకోవడం యిస్తామని, ఆ సమయంలో ఈ వీధి లో ఉంటే గుడి లో ఉన్నట్టు ఉంటుందని చెప్పింది.

నేను పొద్దున నుంచి ఈ సమయం కోసం యెదురు చూస్తాను అని చెప్పడంతో . ఒక చిన్న అపార్థం వల్ల ఎంత తప్పు జరిగింది తెలుసుకొని, ఆ అమ్మాయి కి రోజు సాయంకాలం చింటుతో  ఒక గంట సేపు చదువుచెప్పించే  వాళ్లు చింటు వాళ్ల నాన్న.

అందుకే మాట అనే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకుని  అనాలి

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!