(అంశం:”సంధ్య వేళలో”)
కొంటె ఊసులు
రచన: శిరీష వూటూరి
సంధ్యవేళలో
సనసన్నని
తుంపరలు
వాన చినుకులుగా
రాలగా
మనసు కమ్మని
సంగీతం వింటూ
మట్టి వాసనను
ఆస్వాదిస్తూ
కొంటె ఊసులు
మయూరం వలె
నాట్యమాడగా
పిల్ల తెమ్మెరల
గాలికి కురులు
కదలాడగా
మోముపై చిరునవ్వు
ఆభరణం కాగా
కవుల కలం నుండి
కవితలు లతలా
అల్లుకొనెను, అలరించెను
***