ఆశల ఊపిరి

(అంశం:”సంధ్య వేళలో”)

ఆశల ఊపిరి

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

సంధ్య వేళలో ఊపిరిపోసుకున్న ఆశలెన్నో
ఎర్రనిరవిబింభం ఆకాశంలో పడమరదిక్కున దిగుతూ
గోధూళి వేళయ్యందని ఇంటికి చేరుతున్న గోవులగుంపు
ఒకవైపునుండి మలయమారుతపవనాలు మదిని
పులకిస్తున్నాయి
పచ్చనిపైరులన్నీ చిరునాట్యమాడుతున్నాయి
గగనవీధిలో పక్షులుగుంపు గూటికిచేరడానికి పరుగులు తీస్తున్నాయి
ఊరిచివర కొలనులో కలువలు అస్తమిస్తున్న సూర్యకిరణాలకు సిగ్గుతో తలదించుకుంటున్నాయి
రైతన్నలు పోలంపనులనుండి ఇంటికి చేరుకుంటున్నారు పగటిశ్రమను మరచుటకై
లేగదూడలు గోమాతలకై ఎదురుచూస్తున్నాయి
ఊరిమధ్యలోనున్న గుడిలో సంధ్యాహరతుల సవ్వడులు వీనులకు తాకుతున్నాయి
బడినుండి బాలబాలికలు ఉత్సాహం ఉరకలువేయగా
పరుగులు పెడుతున్నారు ఇంటివైపు
ప్రతిఇంటి ఆడపడచు సంధ్యాదీపాలతో గడపముందుకు చేరుతున్నారు
సంధ్యావందనముచేస్తూ ఆశ్రమంలో నున్న మునులు
నదీతీరమునకు పయనిస్తున్నారు
ఎవరి పనులలో వారు తలమునకలై వున్నారు
కొత్తపెళ్ళికూతురు రాత్రి మగనితో గడిపేక్షణాలను
ఊహిస్తూ మురిసిపోతోంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!