గోధూళి వర్ణం

(అంశం:”సంధ్య వేళలో”)

గోధూళి వర్ణం

రచన: కవిత దాస్యం

అందమైన, ఆహ్లాదమైన
సంధ్య వేళలో…
ఏది చూస్తున్న, ఏం
చేస్తున్నా …
ఏమీ ఆలోచిస్తున్నా కవితగా ఎదలో దాస్తున్న…
మది రాయని కవితేదో చదవగ నే వేచున్నా…
యమునా తీరాన సంధ్యా సమయాన…
నిన్ను చేరి పులకించిన హృదయాలెన్నో..
నీకై గానం చేసిన కోయిల రాగాలెన్నో…
నీకై మువ్వ కట్టిమురిసిన మయూరాలెన్నో..
కలం పట్టి కావ్యం గా మారి రంగుల అద్దుకున్న కవితా రంగవల్లులెన్నో…
గోధూళి వేళ – అసుర సంధ్యా సమయం…
అసుర సంధ్య వేళ పార్వతి సమేత శివుడు కైలాసంలో తాండవం ఆడే సమయం..
అసుర సంధ్యా సమయంలో…
మానవులకు ఆకలి, నిద్ర, బద్ధకం ఆవహించే సమయం…
కనుకనే మెలకువ గా ఉండి హుషారుగా ఉండాలని పెద్దలు చెప్పిన సద్ది మాట జ్ఞాపకం..
సాయం సంధ్యా సమయంలో…
ఆబగా ఇళ్లకు చేరుకుంటున్న గోవుల గిట్టల నుండి రేగిన…
ధూళి పశ్చిమాన్ని ఎరుపు ఎక్కిస్తున్న వైనం…
గోధూళి వేళాయె…
గూళ్ళన్ని కనులాయె అన్న చందంగా…
పిల్ల పక్షులు ఆహారానికి కై వెళ్లిన తల్లికి నిలువెల్లా కళ్ళు చేసుకొని చూసే తరుణం…
ఈ గోధూళి వేళ నే మనసున మధువనిని పంచిన సంధ్య నీకు ప్రణామం…
జీవితంలో తరగని సుమనోహర సుమధుర వర్ణమే కదా ఈ సంధ్యా సమయ కాంతిపుంజం…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!