ప్రేమరాధన

(అంశం:”సంధ్య వేళలో”)

ప్రేమరాధన

రచన: జయ

మది గెలిచిన ప్రియసఖుడు
మేఘాల పల్లకిలో
ఆఘమేఘాల తో
ఆశలు అన్ని దోసిట నింపుకొని.

తన ప్రియసఖిని లాలించా
ఆకాశమంత ప్రేమను..
చెలి కనుల కాటుకగా దిద్ది.
తన చిలిపి ఊసులనే
ప్రియురాలి పెదవులకు చిరునవ్వు గా మలిచి.

ఆ తొలి సంధ్యనే నిచ్చెలి నుదుటన
సింధూరంగా అలంకరించి.
ఆ నీలిగగన్నే చుక్కల చీర గా చుట్టి.
చెలి సొగసలు కు సిగ్గులు అద్ది.

సాయంసంధ్య వేళ సాగరాతీరన..
సన్నజాజులు పాన్పు వేసి.
విరులే మరులై పూలగంధలు విరబూస్తుంటే
నా సఖి కౌగిట్లో..
సాగే ప్రేమరాధన మా ప్రేమ ఆలాపన.
********************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!