నిండు చందమామ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: డా|| బాలాజీ దీక్షితులు పి.వి
అందమైన చకోరం
అల్లేస్తుంది… గుండెను
సుధల సౌందర్యం
సోయగ నురగలై పొంగుతుంది
వలపుల ఆకృతి
ప్రణయనాదం చేస్తుంది… ఎదన
సిగ్గులు మెుగ్గలై విరబూస్తుంటే
కంటి చూపే
కాకరపువ్వత్తై కాటేస్తుంటే
కురులు కరినాగులై
చంపల జారుతుంటే
పారిజాతపు పరిమళ జాతరలో
ప్రేమ తాబూలం వేసుకున్న
వసంత వనదీపికలా ఉన్న
నిండు చందమామ
నీవు…