ఒంటరి బ్రతుకు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: చింతా రాంబాబు
కనులు తెరిచిన నుండి
కనులు మూసే వరకూ
క్షణం తీరిక లేకుండా..
నిరంతర నీ పరుగులు
దేనికోసం….
కాలం కంటే వేగంగా పరిగెత్తి
ఎన్నో ఆవిష్కరణలు సృష్టించి
మనిషిగా గెలవటానికి
నిరంతరం నీతో నీవు యుద్ధం చేస్తూ…
నిన్ను నీవు మోసగించుకుంటూ..
అంతర్జాలం లో
దూరం గా ఉన్న పరిచయాలకు
దగ్గరవ్వటం కోసం
నీకు దగ్గరగా ఉన్న బంధాలకు
దూరం అవుతూ…
ఒంటరిగా జీవిస్తున్నావు
చుట్టూ నీ మనుషులున్నా.
గుడ్