రంగురంగుల బొమ్మలోయ్

రంగురంగుల బొమ్మలోయ్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాధ ఓడూరి

ఆరోజు ఆదివారం కావడంతో వాస్తు రావ్ కాస్త లేటుగానే నిద్రలేచాడు. అదికూడా బయట హడావుడి వినిపించి కంగారుగా లేచి బయటికి వచ్చి చూసాడు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంటికి పెయింటింగ్స్ వేసి ఆర్నెల్లు కూడా కాలేదు. మళ్ళీ కలర్స్ ఎందుకు వెేయిస్తున్నాడబ్బా, ఈ వాస్తు రావ్! అసలు  విషయం కనుక్కోవాలి’ అనుకుంటూ గబగబా మెట్లు దిగబోతూ రెండో మెట్టు మీద తూలి పడ్డాడు. నిద్ర మత్తు ఇంకా వదలకపోవడంతో, తను పడటం ఎవరైనా చూసారనే సందేహంతో రేలింగ్ సందు లోంచి చూసాడు. ఎవ్వరూ చూడలేదు.(ఎవరి పనుల్లో వారుంటే చూసేవారు ఎవరు!?) పక్కింటి కలర్స్ విషయం కనుక్కోవాలనే ఆతృుతతో హమ్మయ్య అనుకుంటూ మెల్లగా రేలింగ్ పట్టుకొని లేచి లుంగి అంచులతో కళ్ళు నులుముకుని హుషారుగా ఈల వేసుకుంటూ కిందకొచ్చి అక్కడ నిలబడి పెయింటర్స్ తో మాట్లాడుతున్న వాస్తు రావ్ దగ్గరకు వచ్చి వాళ్ళ మాటలు వినసాగాడు. మాస్టర్ బెడ్రూం నైరుతూ ఉంది కదా! అదే బీరువా పెడతామే! ఆ గోడకి యాలకల, లవంగాల బొమ్మలెయ్యండి, దక్షిణం గోడకి తమల పాకుల బొమ్మలు, తూర్పు గోడకు ఎర్రని పెయింటింగ్ తో నింపండి. పిల్లల బెడ్రూం ఉత్తరం గోడకి నెమలి ఈకల బొమ్మలు, దక్షణం తూర్పు గోడకి దాల్చినిచెక్కల బొమ్మలు, ఉత్తరం గోడకి సరస్వతి ఆకులు, హాలు మెుత్తం బల్లి తోకల బొమ్మలు, దేవుడి రూంకి నల్ల కుక్క బొమ్మ, కిచెన్ కి అలోవెరా బొమ్మలెయ్యండి. అదిగో ఆ చిన్న గదికి మంచి బ్రైట్ కలర్ వేయండి. ఆ గది బల్లులకి మాత్రమే, ఇంకా చెప్పుకుపోతున్నాడు వాస్తు రావ్. వింటున్న ఆవేష్ కి నిద్ర మత్తు పూర్తిగా వదిలిపోయింది. జుట్టు పీక్కోవలనుకున్నాడు. కానీ చుట్టూ అందరూ ఉండేసరికి ఆలోచన విరమించుకుని అప్రయత్నంగా పెయింటర్స్ వైపు చూసాడు. వారి స్పందన కోసం. వారి మెుహంలో ఎలాంటి వికారమైన ఫీలింగ్స్ కనబడక పోగా ఆనందంతో వారి మెుహం వెలిగిపోతోంది. బహుశా వారి కళ్ళ ముందు ధనలక్ష్మి కనపడుతుందేమో అనుకున్నాడు ఆవేష్. పదినిమిషాల తర్వాత వాస్తు రావ్ చెప్పడం అయ్యాక పక్కకి తిరిగి “గుడ్ మార్నింగ్ ఆవేష్!” అంటూ భుజం మీద చేయి వేసి అంత ఆవేశంగా నిద్ర మత్తుతో వచ్చారేమిటి? మా వాస్తు పెయింటింగ్స్ వినడానికా? అన్నాడు పళ్ళికిలిస్తూ.  ఆవేష్ నుంచి ఎలాంటి సమాధానం లేదు.
బిగుసుకుపోయిన ఆవేష్ ని కుదిపి చూసాడు. వాస్తురావ్. కానీ మన ఆవేష్ ఇంకా తేరుకోలేదు. రకరకాల ఆలోచనలు ఈగల్లా చుట్టు ముట్టాయనుకుంటా. ఈ లోకానికి రావడానికి కొంత సమయం పడుతుందేమో?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!