ఫ్లాన్

ఫ్లాన్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

         రాజేష్, రమణి భార్య, భర్తలు. రాజేష్ ఎడ్డెం అంటే రమణి తడ్డెం అనే రకాలు. ఇలా ఇద్దరూ కలిసి దెబ్బలాడుకుంటూంటే చూసేవారు నవ్వుకునేవారు. కాని వాళ్లిద్దరి గోడవ సరదాగా సాగి పోయేది ఎపుడూ. అంతలోనే దెబ్బలాడుకుంటూ , అంతలోనే కలిసిపోయి నవ్వుకునేవారు. ఒకసారి ఇద్దరూ బయటకి వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. రాజేష్ హిందీ మూవీకి వెళ్దామని, రమణి గుడికి వెళ్దామని, ఇద్దరి మధ్య గోడవ మెుదలైంది. ఈ గొడవంతా గోడచాటు నుండి వింటున్న పక్కింటి పంకజాక్షి మనస్సాగకా వాళ్లింటికీ వచ్చేసరికీ.
కాదు. సినిమాకే వెళ్దాం. అంతగా కావాలంటే, ఏం కావాలన్న తెచ్చిస్తాను. నీకు నచ్చినంతసేపు ఇంట్లో పూజ చేసుకో! పొద్దస్తమానం ఏం సినిమాలు చూస్తారు? మోకాలు పైకీ కట్టిన హిరోయిన్స్  చిరిగినబట్టలు, దేవదాసు కన్న ఆధ్వానంగా తయారైన హిరోలు. కావాలంటే  మీరేళ్లండి. నేను రాను. ఇదిగో, అమ్మాయ్! హా, రండి రండి. అంటీ! కూర్చోండి! ఇద్దరు సిరియస్ గా ఏదో విషయంలో చర్చించుకుంటున్నట్లుంది. అబ్బే, ఏం లేదంటీ.
నాకు చెప్పకూడని విషయమైతే, పోని. చెప్పకండి. మీ వాదన వింటూ, ఆ సీత, గీత నవ్వుకుంటూంటే, ఏదో పెద్దదానిగా సలహా ఇద్దామని వచ్చాను. అదేం లేదంటీ! ఇంతలో, నువ్వుండు. నేను చెప్తానంటూ ముందుకు వచ్చిన రాజేష్. మీరే చెప్పండి. రాకరాక వచ్చిన ఒక్క సెలవు. పట్టుబట్టలు కట్టుకుని గుడికి వెళ్దామంటూ ప్రాణం తీస్తుంది. నేనేమో. మంచి సినిమా రిలీజైంది. చక్కగా జీన్స్, టీ షర్ట్ వేసుకుని, సినిమాకీ వెళ్దామంటున్నాను. దీనికీ అంతా ఆలోచన, గొడవేందుకు? అలా సరదాగా గడపాల్సిన కాస్త టైం గొడవ పడే బదులు మగవాళ్లు ఏ బట్టలు వేసుకోవాలని పెద్ద పట్టింపు లేదు. కనుక, అమ్మాయి ఫ్యాన్సీ చీర కట్టుకుంటే, రెండింటికీ సరిపోతుంది కదా! తొందరగా తయ్యారయి, గుడికి వెళ్లి, అటు నుంచి అటు సినిమాకి కూడా వెళ్లవచ్చు. ఇద్దరూ అనుకున్నది జరుగుతుంది. అని సలహా ఇచ్చిందామె. దానితో ఒళ్లు మండిన రమణి ఆఁ నువ్వు సలహా ఇస్తావని దెబ్బలాడుకుంటున్నాము. వెళ్లి నీ పని చూసుకోమ్మా! అని మోహమాటం లేకుండా ముఖం మీదే అనేసరికీ, భార్యభర్తల మధ్య తలదూర్చిన తన తెలివితక్కువకు తల వంచుకుని, ఇంటికీ వెళ్తున్న పంకజాక్షిని చూసిన ఇరుగుపొరుగు
బాగా అయింది. లేకపోతే భార్య భర్తల మధ్యకు ఎవరూ వెళ్లమన్నారు. వాళ్లిద్దరూ ఎప్పటికైనా ఒకటే. మధ్యకి వెళ్తే మనమే వెర్రివాళ్లం అవుతాం. అని ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటూ, నవ్వుకున్నారు.
ఆ తరువాత  రమణి, రాజేష్ తర్జన భర్జన పడి, చివరికి కాంప్రమైజై, చక్కగా పక్కింటి పంకజాక్షి సలహా ఇచ్చినట్లు మంచి బ్రైట్ కలర్ శారీకీ గోల్డెన్ థ్రెండ్, బ్రీడ్స్ తో  వర్క్ చేసిన ఫ్యాన్సీ చీర కట్టుకుని అందంగా తయారై ముందుగా గుడికి వెళ్లి, అటునుంచి అటు సినిమా చూసి, మంచి హోటల్ లో డిన్నర్ చేసి తృప్తిగా నవ్వుకుంటూ, ఇంటికి తిరిగి వచ్చారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!