చీకటి దెయ్యం


చీకటి దెయ్యం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : మాధవి కాళ్ల

         రాజేష్ కి ఈ మధ్యనే పెళ్లయింది. పెళ్లి ఉన్నంతలో చాలా ఘనంగా చేశారు. రాజేష్ కి ఊరు మొత్తం తన ఫ్రెండ్సే కొత్తగా పెళ్లి అవ్వడం వల్ల పార్టీ అడిగారు. సరే ఇస్తాను అని చెప్పాడు రాజేష్ తన ఫ్రెండ్స్ కి. తన భార్య కమలకి తెలియకుండా పార్టీ ఇవ్వాలని అనుకున్నాడు తనకి తెలిస్తే కమల అసలు ఊరుకోదు డబ్బులు ఖర్చు పెడుతున్నావని తిడుతుంది. అని భయంతో కమల కి విషయం చెప్పడు. రాజేష్ నేను నా ఫ్రెండ్స్ బయటి ఊరు వెళ్తున్నాము వచ్చినప్పుడుకి రేపు ఉదయం అవుద్ది అని చెప్పాడు కమలకి. సరే వెళ్లి రండి అని చెప్పింది. కమల ఊరు చివర ఉన్న ఒక బంగ్లాలో పార్టీ ఏర్పాటు చేస్తాడు. తన  ఫ్రెండ్స్ కి ఊరి చివర ఉన్న బంగ్లాలోకి రమ్మని చెప్పాడు రాజేష్. కమల కి రాత్రిపూట దెయ్యాల సినిమాలు చూడడం అంటే మహా ఇష్టం ఎక్కడైనా భూత బంగ్లాలు ఉంటే రాత్రిపూట వెళ్లి చూసి వస్తుంది అంత ఇష్టం. రాజేష్ కి చిన్నతనం నుండి చీకటి అంటే మహా భయం ఈ విషయం తన ఫ్రెండ్స్ కానీ ఇటు తన భార్యకు కానీ తెలీదు. తన ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చుని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుని ఇంకా తాగడం మొదలు పెట్టారు. మాట్లాడుకుంటూ పీకల దాకా తాగి ఎక్కడ వాళ్ళు అక్కడే పడిపోయారు. అయితే రాజేష్ కి రాత్రి మెలకువ వచ్చింది. అయితే ఎవరు లేపనా లేవట్లేదు అయితే భయంతో బిక్కు బిక్కుమంటూ బయటికి వచ్చాడు. అక్కడ ఒక మనిషి ఆకారాన్ని చూసి పరిగెత్తుకొని లోపలికి వెళ్ళిపోయాడు. మళ్లీ తను ఫ్రెండ్స్ లేపాడు కానీ ఎవరూ లేవలేదు మళ్లీ బయటికి వచ్చాడు బిక్కు బిక్కుమంటూ అప్పుడే దూరంగా ఒక నక్క అరుస్తుంది. దాని తర్వాత గజ్జల సౌండ్ వినిపించింది. ధైర్యం చేసి దేవుని తలుచుకుంటూ బయటికి వచ్చి అప్పుడే ఒక ఆవు పరిగెత్తుకుంటూ వస్తుంది అది చూసిన రాజేష్ భయంతో పరుగులు పెడుతున్నాడు భయంతో అరుస్తున్నావు అక్కడ ఒక ఆకారం కనిపించింది అది చూసి ఆవు పారిపోయింది రాజేష్ అక్కడ నిలబడిపోయాడు ఆకరాన్ని చూసి రాజేష్ అక్కడే భయంతో షాక్ తో అక్కడే ఉండిపోయాడు కళ్ళు మూసుకుంటూ అమ్మో.. చీకటి దెయ్యం..అమ్మో చీకటి దెయ్యం నన్ను కాపాడండి రక్షించండి అని భయంతో పరుగులేడుతూ ఒక దగ్గర స్పృహ కోల్పోయాడు.
మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే తన ఇంట్లో ఉన్నాడు. అది చూసి కమల ఏంటి నేను ఇక్కడ ఉన్నాను అని అయోమయంగా అడిగాడు రాజేష్. మీరు మర్చిపోయారా నిన్న రాత్రి నన్ను చూసి మీరు చీకటి దయ్యం చీకటి దెయ్యమని భయపడ్డారు అండి అని చెప్పింది కమల. మీకు చీకటి అంటే భయం అండి అని అమాయకంగా అడిగింది నిన్న రాత్రి మీరు అక్కడ ఏం చేస్తున్నారు. అని కోపంగా అడిగింది కమల. నాకు చీకటి అంటే భయం లేదు అని చెప్పి అది కాదే కమల బంగ్లా దగ్గరకు నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్న అని అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు రాజేష్.. అప్పుడే రాజేష్ ఫ్రెండ్స్ వచ్చి అసలు నిజం చెప్పడం వల్ల  కమల కోపంతో రోకలి బండ పట్టుకోవడం చూసి రాజేష్ పరుగు వెనకాల కమల పరిగెడుతుంది. అది చూసి రాజేష్ ఫ్రెండ్స్ ఒకటే నవ్వుతున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!