అమ్మ

అమ్మ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: అలేఖ్య

అమ్మంటే ఓ పునర్జన్మ
తొమ్మిది నెలల నిరీక్షణ
అంతులేని మమకారానికి రూపం
అమ్మ ఒడే బిడ్డకు రక్షణ కవచం
మమతానురాగాలకు రూపం
తన గుండెనే ప్రేమ భాండాగారం

అలుపన్నదే ఎరుగదే తన గుండె
పిల్లల ఉన్నతికై తపిస్తుంది తన ఎద
తన ఇష్టాలను సైతం బిడ్డల
బాగోగులకై త్యజించే త్యాగమయి
కొసరి కొసరి వడ్డించే అన్నపూర్ణ
లాలిపాట పాడి నిదురపుచ్చే చల్లని ఒడి
ఇలలోన వెలసిన మమతల దేవత

నెత్తుటికి ఊపిరోసే ప్రాణమా
ఇంటికి వెలుగునిచ్చే దీపమా
ఓ మాతృదేవోభవ సుఖీభవ..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!