ఆదర్శమూర్తి

ఆదర్శమూర్తి

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

ఎగిసె నింగికి ఒక తార
సేవ చేసెను మనసార
ముద్దు బిడ్డడయ్యెను
స్వర్గమేగె ధృవతార

గడించె ఎనలేని కీర్తి
పొందెను ఎందరో స్ఫూర్తి
చిరస్మరణీయ రావత్
భారత ఆదర్శ మూర్తి

భారత ఆణిముత్యం
భారతావని ముత్యం
భారత కు ఆదర్శం
రావత్ అమూల్య ముత్యం

దేశ సేవయే ద్యేయం
అంతా దేశభక్తి మయం
పరాక్రమ సూరీడు
దేశానికిచ్చెనుఅభయం

దేశభక్తి పరాయణుడు
త్రివిధ దళాలకు వీరుడు
భరతమాత ముద్దుబిడ్డ
నేడు చిరస్మరణీయుడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!