నీ జత చేర్చుకోవా!
నీ లీల వినలేని నా వీనులు
నిన్ను గాంచని నా కనులు
నిన్ను స్మరించలేని నా మనసు
నీ గానం చెయ్యలేని నా పెదవులు
నీకు మ్రొక్కని నా కరములు
నీ స్పర్శ లేనిదే ఈ తనువు
మనసా వాచా నిన్ను తలవలేని
ఈ ప్రాణం ఈ జీవం వ్యర్థం!!
నీకోసం పరితపించే రాధను నేను
నా కోసం తరలి రాలేవా?
నిన్నే స్మరించే రుక్మిణిని నేను
నన్ను కానగ ఇలదిగి రాలేవా?
నిన్నే తలచేటి గోపికను నేను
నీ మురళీస్వరం వినిపించగా రావా?
నిన్నే మదిని నింపుకున్న నీ భక్తురాలను
నీ మదిలో నాకు చోటివ్వలేవా?
నా జన్మ ధన్యం చెయ్యగ రావా?
నన్ను నీ జత చేర్చుకోవా?
ఈ విరహం తాళలేకున్నాను
నా చెంత చేరి చింత తీర్చవా?
నిన్ను చేరని క్షణాన, కృష్ణా!
నా జీవితం అడవి గాచిన వెన్నెలయే!!
రచయిత్రి: పరిమళ కళ్యాణ్
Thanks akka
చాలా బాగుంది చెల్లి. 😊🌹🌹