నా ప్రియనేస్తం చరవాణి

నా ప్రియనేస్తం చరవాణి

రచన: జయ

అందమైన జీవితంలో
మలుపులు మజిలిలు
ఎన్నెన్నో..

కొత్తగా రెక్కలు తొడిగిన
ఊహలకు కొత్త రంగులు అద్ది
అరచేతిలో వైకుంఠమై నిలిచి
ప్రపంచపు వింతలెన్నో
కళ్ళ ముందు నిలిపే భూలోక స్వర్గమై
మైమరిపించే ఊసుల వాహిణి

ప్రేమ ఋతువులు పూలుతోడిగి
తేనెమనస్సులో పరవశమేదో
పరిమళింప చేసిన పారిజాతమై
వెన్నెల తాపం తీర్చే చంద్రమల్లే
మారింది లే ఆశలవాణి.

రంగుల ,హంగులు,సొగసులు అద్దుతూ
పైపైనే మధురోహన పల్లకిలో ఊరేగిస్తూ
బోసినవ్వుల నుంచి చిలిపినవ్వుల వరకు
తన మహిమను చూపి ఆనందడోలికలు ఆడించి మనసున మనిషై నిలిచిన అంతర్జాల మణి కర్ణిక.

చిన్న,పెద్ద, వయస్సును,
మరిపించి మురిపించి
మనోహరమై మదిని మీటి
నీవే కదా నను మాయజేసి
మంత్రమేసి మత్తు జల్లి
నను నీతో నడిపించే
నా ఊసుల ఆశల వాహిణి
నా ప్రియనేస్తం చరవాణి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!