క్షమయా ధరిత్రీ!!

క్షమయా ధరిత్రీ!!

రచన:: అశ్విని sanketh

“త్వరగా కానియ్యండి అమ్మా! పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయ్యింది అంటూ హాల్ అంతా హడావిడిగా తిరుగుతున్నాడు”శేషారత్నం.

“ఏంటి బాబాయ్ పెళ్లి చూపులకు ఇంత హడావిడి చేస్తున్నారు” అంటారు బంధువుల పిల్లలు హాల్ సర్దుతూ…

“హడావిడి చెయ్యాలి కధమ్మా! వచ్చేది కోటీశ్వరులు. ఆ మాత్రం వాళ్ళకి తగ్గట్టు ఉండాలి కదా ఏర్పాట్లు అంటాడు” శేషారత్నం ఏర్పాట్లు చూస్తూ…

“అవునవును.అయినా, మన సిరి అదృష్ట వంతురాలు. ఏరికోరి మరీ కోటీశ్వరుల సంబంధం వచ్చింది బాబాయి”.

అదీ నిజమే, వెళ్ళండి వెళ్లి సిరి తయారు అయ్యిందో లేదో చూడండి అంటూ వారిని పంపి అంతా సర్థుతుంటే గుమ్మం ముందు కార్ హార్న్ వినబడే సరికి బయటికి వెళ్తాడు శేషారత్నం వారిని రిసీవ్ చేసుకోడానికి.

పెళ్ళికొడుకు తల్లి,తండ్రితో పాటు వస్తాడు.వాళ్ళని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు శేషు.

పెళ్లి చూపుల తంతు మొదలు అయ్యింది.శేషారత్నం ఎందుకో కంగారుగా ఉండడం చూసిన శేషారత్నం బార్య ఏమైంది అని అడుగుతున్నా సమాధానం ఇవ్వక ఊరుకుంటాడు అతడు.

మాకు మీ అమ్మాయి ఎప్పుడో నచ్చింది. ఈ పెళ్లి చూపులు కూడా ఫార్మల్టి కోసమే. మాకు ఈ పెళ్లి ఒకే అంటారు పెళ్లి కొడుకు తండ్రి సిరి పనిచేసే ఆఫీస్ ఎండీ పరశురామ్.

పంతులు గారితో తాంబూలాలుకి ముహూర్తం పెట్టించి కబురు పెట్టండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు.

శేషారత్నం మాత్రం బాధతో అలా వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ నేను చేసిన తప్పుకు నా కూతురు శిక్ష అనుభవించ కూడదు అనుకుంటాడు మనసులో బాధగా.

***

పరశురామ్ ఇంట్లో…

అమ్మా మీకోసం ఎవరో వచ్చారు అంటుంది పనిమనిషి గాయిత్రితో.

సరే కూర్చోమను, వస్తున్నా అంటూ… గదిలోంచి హల్ లోకి వెళ్ళిన గాయిత్రి అక్కడ ఉన్న వ్యక్తిని చూస్తూ మీరు ఇక్కడ అంటూ… రండి కూర్చోండి అన్నయ్య గారు! అంటుంది గాయిత్రి.

గాయిత్రి ఎదుటున నిలబడిన వ్యక్తి గాయిత్రితో “నన్ను క్షమించండి నేను మీతో ప్రవర్తించిన తీరు మరచి పోయి, నా బిడ్డను మీలాంటి కోటీశ్వరుల ఇంటికి కోడలిగా ఒప్పుకున్నందుకు అంటూ గాయిత్రి కాళ్ళకు మొక్కుతూ ఆడది ‘క్షమయా ధరిత్రీ!’ అని విన్న నేను నిన్ను చూసాక అర్థం అయ్యింది”

నేను నిన్ను పెట్టిన బాధల వల్ల నువ్వు ఉద్యోగం కూడా మానేశావు,ఇల్లు మార్చావు.అయినా, నీ బాధకి కారణం అయిన నన్ను క్షమించావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే…”

“అయ్యో! అదంతా గతం.గతం తలుచుకుని వర్తమానాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకునే వాళ్ళం కాదు మేము.

అవును నా ప్రమోషన్ కోసం నీ దగ్గరికి వస్తె, దానికి కానుకగా నన్ను అడిగావు.అది కుదరలేదని నా ఉద్యోగం కూడా తీయించావు.అదే మంచిది అయ్యింది నాకు.

అప్పటివరకు గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్న మా వారి ఉద్యోగం పోవడం, వారు అంతవరకు సంపాదించిన డబ్బు తేవడం. మేము వేరే ఊరు వెళ్లి ఆ డబ్బులతో చిన్న వ్యాపారం మొదలు పెట్టడం అది పెరిగి పెరిగి ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీగా మారడం, అదే కంపెనీలో, నీ కూతురు సిరి జాయిన్ అవ్వటం, నా కొడుక్కి నచ్చటం అన్ని మాయల జరిగిపోయాయి.

అప్పుడు నీ వల్ల ఉద్యోగం పోవడం వల్లే నేను కసిగా వ్యాపారంలో చేరాను ఏమో! అందుకే ఇప్పుడు ఇలా ఏ లోటూ లేకుండా ఉండడానికి అదే కారణం అయి ఉండవచ్చు.

ఎది జరిగినా నా మంచికే జరిగింది.నాకు ఇప్పుడు దాని గురించి అలోచించి,బాధపడే అవసరమే లేదు.

మీరు కూడా అది మరచిపోయి హాయిగా ఉండండి. నేను మన పాత జ్ఞాపకాలను, నిన్న పెళ్లి కుదిరింది అని పిల్లల కళ్ళల్లో ఆనందం చూసిన వెంటనే ఇన్ని రోజులుగా గుర్తు పెట్టుకున్న నా బాధని,జ్ఞాపకాలను వదిలేసా అంటుంది” గాయిత్రి.

“ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది నా వల్ల నా కూతురి బ్రతుకు ఎక్కడ నాశనం అవుతుందా అని బాధపడ్డాను”.

“నేను కూడా ఒక ఆడ పిల్లనే,ఇంకో ఆడదాని బ్రతుకు నాశనం చేసే అంత నీచమైన బుద్ధి లేదు నాకు.ఇప్పటి నుండి నీ కూతురు నా కూతురుతో సమానం. మీ అమ్మాయి మా ఇంటి కోడలు ఇక మీరు ధైర్యంగా వెళ్లి రండి అంటుంది” గాయిత్రి.

చాలా సంతోషం అమ్మా! అంటూ అక్కడ నుండి బయటికి వస్తూ “ఆడవాళ్ళని బాధపెట్టే నా లాంటి వాళ్ళను కూడా క్షమించే గుణం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది” అనుకుంటూ కూతురి పెళ్లికి ఎటువంటి ఆటంకం లేదు అనే బరోసాతో ఇల్లు చేరుతాడు ఆనందంగా శేషారత్నం

సమాప్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!