పోలిక

పోలిక
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

సహజంగా పిల్లలకు ప్రతి విషయంలోనూ పక్క వారితో పోల్చుకునే అలవాటు ఉంటుంది. అనగనగా ఒక ఊరిలో యోగిత, పూజిత అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ల ఇద్దరికి అన్నింటిలోనూ పోటి ఉండేది. ఇద్దరూ ఒక తరగతి చదువుతూ ఉండటం వలన, చదువులో పోటి, ఆటల్లో పోటీ, అందంగా రెడీ అవ్వటంలో పోటి, కొత్త వస్తువులు కొనటంలో పోటీ, ఇలా ప్రతి విషయంలోనూ నేను ముందు అంటే నేను ముందు అంటూ దూసుకుపోతున్నారు. ఆరోగ్యకరమైన పోటీ
విద్యార్థుల వికాసంలో మేటి పోటి తత్వం మదిలో
విజయం పొందాలి మలిలో అలా నీదా, నాదా గెలుపు అన్నట్టు చదవ సాగారు. ఎంత పోలిక ఉన్నా, ఇద్దరి స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు వేరుగా ఉంటాయి కదా. అలాగే, యోగిత, పూజిత విషయంలో కూడా తేడా ఉంది. ఆడంబరం లేని జీవితం, లోటు లేని పయనం చదువు తోటిదే ప్రాణం
మరి లేదు జీవనం అతి సాధారణమైన కుటుంబం
ఆప్యాయతకు లోటు లేని పెంపకం యోగినిలా కృషి
తానొక ఋషి ఈ విధంగా యోగిత కష్ట పడి చదువు తుంది. వేరే ఏ ధ్యాస లేకుండా. ఇక పోతే, పూజిత విషయం చూద్దాం. నడకలోనే డాంభికం
నడతలోనే అహంకారం లోటుపాటు ఎరుగని జీవితం ఆధునికతను ఎంచుకున్న మనస్తత్వం
కొత్త విషయాల పై అవగాహన ఆడంభరాలు కొత్త పుంతలు తొక్కునా మారుతున్న సమాజం
ఇదే నేటి దౌర్భాగ్యం అలా తనకి తెలిసిన కొత్త  ప్రపంచంలో తను విహరిస్తూ ఉంటుంది పూజిత.
వాళ్ళ ఇద్దరి గురించి తెలిసిన యోగిత వాళ్ళ అమ్మ మదిలో కలవరం మొదలౌతుంది. ఎటు పోతోంది ఈ ప్రపంచం మారుతోంది పసి పిల్లల వినోదం పెరుగుతోంది పోటీ తత్వం కాజాలదు ఇది అలసత్వం చిన్న పిల్లలకు అన్ని ఆడంభరాలు అవసరం లేదు అనేది యోగిత వాళ్ళ అమ్మ శ్రీజ అభిప్రాయం. ఒక వయసును బట్టీ వాచీ, సెల్ ఫోన్, కళ్ళ జోడు, బంగారు వస్తువులు లాంటివి కొనివ్వాలి ఆన్నది శ్రీజ అభిప్రాయం. కానీ, ఆశ (పూజిత వాళ్ళ అమ్మ ) మాత్రం మారుతున్న  ప్రపంచంతో మనమూ మారాలి. పిల్లలకు ట్రెండ్ తెలిసేలా నేర్పించాలి అంటూ వాదించేది. పిల్లలకు ఎంత వరకూ అవసరమో, అవే అందించాలి. ఆధునికత పేరుతో ఆడంభరాలకు పోతే, ఆ వేగాన్ని అందుకోలేని పిల్లలు జీవితాన్ని నష్ట పోతారు. ఆధునికత తెలిసేలా చెయ్యాలి. నడవడిక ఎప్పుడూ గమనించాలి. హంగులకు అలవాటు పడి, కష్టపడటం మర్చిపోయింది పూజిత. ఫలితంగా చదువు తగ్గి పోయింది. చాలా సంచత్సరాల విరామం తరువాత కూతురు చదువు చూసి, చలించి పోయింది ఆశ.
నీతి: పిల్లలకు చదువు, సంస్కారం అవసరం. హంగు, ఆర్బాటాలు శాశ్వతం కాదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!