ప్రేమ

అంశం: ప్రేమలేఖ

ప్రేమ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జ్యోతిరాణి(జో)

ప్రేమను పొందే ప్రేమగా
ఎప్పటికి నీ హృదయంలో
నన్ను ఉండిపోని మనసా..
నీ నా మాటగా సాగె ఈ పయనంలో
ప్రతి అక్షరం హృదయాన్ని తాకే
ప్రేమాసరాగాలే అని చెప్పనా
నువ్వు నేనుగా ఉన్న క్షణమే చాలదా
ఎంతటి ఒడిదొడుకులనైనా ఎదురించే
ధైర్యాన్ని నీ ప్రేమలో పొందినందుకు
ఎన్ని అక్షరాలలో కుదించిన
ఇంకా ఏదో వెలితిగా అనిపించే
నా మనసుకి నేను ఎంత
ప్రేమను చెప్పిన ఇంకా ఎదో
మూల నీ ప్రేమను వర్ణించలేక
మూగబోయిన అక్షరాలను
ఓదార్చి ఇంకో కొత్త ప్రేమకావ్యాన్ని
అందించన మనసా..
మనసు వెన్నముద్ద మాటల తియ్యదనం
నెనున్నాననే భరోసా, నా సంతోషానికి
నా ప్రతిఅడుగు వెనుక ఉన్న
ప్రేమఅండను ఎన్ని మాటలలో
చెప్పిన ప్రతిసారి
ప్రేమలో పడిపోయే మనసు నీదని
చెప్పనా నీ ప్రేమలో..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!