అందుకో ఈ ప్రేమలేఖ

అంశం: ప్రేమలేఖ

అందుకో ఈ ప్రేమలేఖ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

నెల్లూరు,
తేది:12/02/1984

 ప్రియమైన సుజాత కు నీవు చాలా అందంగా ఉంటావు. అని రాయడం, కన్నా నీవు కనిపించి నప్పుడు నీతోనే చెప్పాలను కొన్నాను. కానీ కుదరక ఈ లేఖ లోనే చెప్పేస్తున్నాను. నీవు అందంగా నాకు ‌మాత్రమే కనిపిస్తున్నావు సుజాత! నేను నిన్ను మొదటగా మా చుట్టాలింటికి వేసవి సెలవుల్లో వచ్చినప్పుడు. అక్కడ అందరూ ఆడుకొనే దానికి వచ్చారు. అందులో నీవు ఉన్నావు. తరువాత ఇంకో సారి మాకు తెలిసిన వారి పెళ్లిలో చేసాను. ఆరోజు నుంచి నీవు నా మనసు లో ముద్రపడి పోయావు. అలా! నా మనసులో నీవు ఉండి పోయావు. అప్పటి నుంచి నిన్నుచూడాలని, మీ వీధి కివచ్చేవాన్ని అప్పుడప్పుడు. నీకు తెలియకండా దూరం నుంచి చూసేవాన్ని ఒక రోజు మీ వీధి లో చాలా సేపు నీకోసం ఉండి వచ్చి మీ ఇంట్లో వాటర్ అడిగి తాగాను. ఆరోజు నిను చాల దగ్గర నుంచి చూసాను, అంతే కాదు నీవే గ్లాసు తో నీళ్ళ ఇచ్చావు. నీచేతిలో నుంచి నీళ్లు గ్లాస్ తీసుకొనేటప్పడు.  ఆ గ్లాసు నీ చేతి నుండి నాచేతిలోకి మారేటప్పుడు. నీచేయి, నాచేయికి, తగిలి నప్పుడు ఆ శుతి మెత్తని నీ చిగురాకుల లాంటి నీ చేతివేళ్ళు నా అరచేయి తగిలిన ఆ మధుర అనుభూతి నాకు ఎప్పుడు కూడా గుర్తుఉంటుంది. ఆచేయి నా తోనే ఎప్పటికీ ఉంటే బాగుంటుందని  అనిపించింది. ఆరోజు వస్తుందా!? సుజాత. ఒకసారి నీవు అనుకోకుండా  త్రీహాల్స్ లో కనిపించవు. లక్కీగా నీ పక్కన మాకు తెలిసి మీ వీధి లో ఉండే నా క్లాస్ మెంట్ కనిపించాడు. ఇంటర్ మిషన్ లో నీ కోసం అని పాప్  కార్న్ పంపాను. వాడితో ఇక అప్పటినుంచి, నేను సినిమా చూడటం మానేసి నీవు నేను పంపిన పాప్ కార్న్ తింటున్నావా! లేదా అని చూస్తూనే ఉన్న సినిమా అయిపోయేదాక, ఆ తరువాత ఎగ్జామ్స్ అప్పుడు నీవు మా కాలేజీలో నే పడ్డావు. ఆరోజు రూము చూపమమని నన్నే అడిగావు ఇకచూడు నా సంతోషానికి హద్దులు లేవు నీకు రూము చూపించి రెనాల్డ్ పెన్ కొని పరుగు పరుగు వచ్చి నీకు పెన్ తోపాటు ఆల్ ది బెస్ట్ చెప్పే అవకాశం వచ్చింది. చాలా త్రిల్ గా ఫీల్ ఐనా, ఒకరోజు వీధిలో ఉండే బావి లో నీళ్లు తోడుతుంటే తాగునీరు కోసం అని బావి దగ్గరకు వచ్చావు. నేను అక్కడే నీళ్లు తోడుతున్న గబ, గబ, నీ బిందె తీసుకొని నీళ్లు తోడినీ బిందెలో నేనే నింపా నాకు చాలా ఖుషీ ఐనా!ఆ పక్కనే ఉన్నా ఆంటి జోక్ కూడ వేసింది.
నీకు తెలియకుండానే సైకిల్ మీద నీకు చాలా సార్లు ఎదురోచ్చా, అలా ఎదురోచ్చిన ప్రతిసారీ ఏమిటో ఊహా లో తేలిపోయేవాన్ని ఇది” ప్రేమ” ఏమో, ఒక్కో సారి అన్నం ఆకలి పుట్టేది కాదు, ఇది ప్రేమ లక్షణాలా! మా స్నేహితులు ఎక్కడ కన్న రమ్మన్నా కూడ వారితో కన్నా నీవు ఉండే వీధిలో తిరగాలని అని పించి వచ్చి కాచుకొనేవాన్ని నీవు అప్పడప్పుడు మీ వీధి షాపుకు వచ్చి ఏదో పాలు పేకెట్, గుడ్లు, ఇక చిన్న చిన్న షాపింగ్ చేసేదానివి. నీవు నన్ను చూసి రెండు మూడు సార్లు చిన్న చిరునవ్వు కూడ ఇచ్చేదానవు. నీకు ఎలా ఉన్నిందో ఏమో కానీ నాకు చెప్పలేనంత ఆనందంగా ఉండేది.
ఇ‌లా నీ గుర్తు ల‌తో రోజు గుర్తు చేసుకుంటూ ఉండేవాన్ని ఏఫ్రిల్ లో శ్రీరామనవమి వేడుకలు జరిగే టప్పుడు ప్రతి రోజు రాత్రి శ్రీరామ మందిరంలో బొమ్మల కొలువులు ఊరు అంతా చూడటానికి వచ్చేవారు. అప్పుడు నీవు వెళ్ళే ప్రతి మందిరం కు నీ వెనకాలే వచ్చే వాన్ని నీకు, జంతికలు, పళ్ళీలు, గుగ్గుళ్ళు, ఇచ్చేవాన్ని, నీవు మొదట తీసుకొనే దానవు కావు. తరువాత తీసుకొనే దానవు అబ్బో! నాచేతో నీకు ఇచ్చేటప్పుడు త్రిల్ గా, చాలా బాగున్నింది. ఈ విషయం  మా అవ్వ దాక వచ్చింది. ఎవరు చెప్పేరో,నన్ను మా అవ్వఅడగలేదులే, మా అవ్వకు నేను అమాయకుడిని, ఇలా నిను తలచుకోను రోజులే లేవు అనుకో! సుజాత ఈ ఉత్తరం నీకు చాల రోజుల నుంచి రాయాలని ట్రైయ్ చేసా, కానీ దైర్యం సరిపోక రాయలేదు. ఇప్పటికైనా నీకు అర్దంఅయితే నీవు నన్ను ప్రేమిస్తు న్నావాలేదా! ఏదో ఒక విధంగా తెలుపు, రేపు 14వ.తారీకన ప్రేమికుల రోజు అప్పటి కి ఈ లెటర్ నీకు చేరుతుంది. నీవు నీ ఇష్టం తెలిపితే0, మనం సంతోషంగా ఉందాం. మిగిలినవి ఒకరిని ఒకరు నేరుగా కలసి మాట్లాడు కుందాం. వచ్చేటప్పుడు. చాకెలేట్స్ , తీసుకుని రాను, నీకళ్ళు, నీపెదాలు, నీబుగ్గలు ఉన్నాయిగా!  అవి చాలు, అవే స్వీట్, హాట్, కూల్ డ్రింక్, సుజాత ఐ లవ్ యూ! నీవు తప్పక ‌నీ ఒపీనియన్ తెలుపగలవు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఐ మీన్ తేనెలాంటి మనసుతో, ఇంకా చెప్పాలని ఉంది చెప్పేది. ఏలా! ఏందుకో నాకు ఈ గుండె దడ! ఓ మనసా! నీవు తెలుసుకో! నీ కోసమే నేనని!

ఇట్లు
నీప్రేమ కోరే సుభాష్
ప్రేమ్ నగర్,నెల్లూరు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!