ప్రేమ గొప్ప వరం

అంశం: ప్రేమలేఖ

ప్రేమ గొప్ప వరం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత.కోకిల

హాయ్ నందు ఎలా ఉన్నావు నా మీద కోపంగా ఉందా! సారి నా వైపు అలా చూడకు ప్లీజ్ ప్లీజ్ వెంటనే రీప్లై ఇవ్వలేదని కదూ, నాకు తెలుసులే నీకు చాలా కోపం వచ్చి ఉంటుందని ఎం చెయ్యమంటావ్ నందు నీవు చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. మనం అనుకన్న ప్రకారం జరగాలంటే ఈ పాట్లు తప్పదుగ మన ప్రేమ ఆదర్శం కావాలని రెండు కుటుంబాలకు తలవంపులు తెేవద్దని మంచి ప్రేమికులుగా మనమే ఒక మంచి జంటగా ప్రేమికులకు ఆదర్శంగా ఉండాలని మన కాళ్లపై మనం నిలబడ్డాకే, పెళ్లి చేసుకుందామని అనుకున్నాము కదా! నీ మాటల్లో ఆత్మవిశ్వాసం నీ అడుగులో ధైర్యం అదే నాకు చాలా నచ్చింది. నందు మనకు మన ప్రేమ ఎంత ముఖ్యమో మన తల్లిదండ్రులు కూడా మనకు అంతే ముఖ్యం అన్నావు చూడు ఆ మాట చాలా నచ్చింది. నాకు అమెజాన్లో ఇంటర్వ్యూ వచ్చింది దాదాపుగా నేను సెలెక్ట్ అయినట్టెే నందు నేను అదే పనిలో ఉన్న!
ప్రేమ ఒక మధురమైన భావన అని ప్రేమ ఎట్రాక్షన్ కాదని ఇద్దరిని ఒక్కటి చేసే జీవితమని ప్రేమించే ప్రేమికులకు మనం ఒక ఆదర్శం కావాలని ఏ ఒక్కరూ ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకోవద్దని. పెద్దల అనుమతి తీసుకోవాలని మనం వారికి నమ్మకం కలిగించాలని అప్పుడే ప్రేమకు విలువ ఉంటుందని. రెండు కుటుంబాలు బాగుంటాయని అనేవాడిని కదా! నిజమే నందు ప్రేమించుకుని రెండు కుటుంబాలను ఎదిరించి చేసుకొని తృప్తి లేని జీవితం ఎందుకు నందు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని తెల్లవారితే ఏమవుతుందోనని భయపడుతూ బ్రతకడంకంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది నిజంగా చేసుకోవాలనుకుంటే మన కాళ్లపై మనము నిలబడి తల్లిదండ్రులకు నమ్మకం కల్పించి ఒప్పించి చేసుకోవడమే మంచిది అప్పుడే ఆదర్శవంతమైన పిల్లలుగా గుర్తింపబడతాము. అది చక్కటి జీవితం అవుతుంది. అందులో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి. మంచి మనసుతో  ప్రేమానురాగాలతో ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ తుది వరకూ ఇద్దరూ ఒకటిగానే ఉంటూ జీవితాన్ని  ఆదర్శవంతంగా చేసుకోవాలి. ప్రేమించి వదిలేయడం ప్రేమించి పెళ్లిచేసుకొని విడిపోవడం ఇలాంటివి చాలా దురదృష్టకరం మనం  రోజూ వింటూ చూస్తూనే ఉన్నాము. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో కదా! పిల్లలు చేసిన తప్పులకి తల్లిదండ్రులు కూడా బలి అవుతున్నారు ఎంత ఘోరం. చెడు చేయమని ఏ తల్లిదండ్రులు చెప్పరు కదా? పిల్లలను పెంచి పెద్ద చేసి వాళ్లకు విద్యా బుద్ధులు నేర్పిస్తే వారికి ఇచ్చే ప్రతిఫలం ఇదేనా వారి అభిప్రాయాలను ఎంతైనా మనం గౌరవించాలి. ఎన్నడూ వ్యతిరేకించకూడదు, ఆడ పిల్లలను చదివించాలంటేనే  భయపడుతున్నారు. ఇప్పటి జెనరేషన్ అలాంటిది మరి అయ్యో నందు మర్చిపోయా అక్కకి పెళ్లి ఫిక్స్ అయింది. చెప్పనెే లేదు కదూ? నెక్స్ట్ మంత్ సెవంటీంత్ నాన్నకు ఒక బాధ్యత అయిపోతుంది. అక్క పెళ్లికి రావాలి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి నందు ఇంకా విషయాలు నా లెేఖ అందగానే రిప్లై ఇస్తావు కదూ! నీవు తొందరగా రావాలి నువ్వు వేసె మూడుముళ్ల బంధంతో మనము ఒక్కటి కావాలని కోరుకుంటూ ప్రేమతో నీ కోసం  ఎదురు చూసే నీ చంద్రలేఖ బాయ్.. బాయ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!