అంకిత అంతం

అంకిత అంతం

రచయిత :: బొడ్డు హారిక (కోమలి)

అంకిత ఆడుతూ పాడుతూ అందరితో సరదాగా కలిసిపోతూ ఉండే అమ్మాయి, ఆరవ తరగతి చదువుతుంది. పాఠశాలకు స్నేహితుల అందరితో కలసి మెలసి వెలుతూ ఉండేది. అంకిత అమ్మ నాన్న పూలు గుచ్చి అమ్ముతూ ఉంటారు.

అలా వస్తూ ఉన్న అంకితను అదే దారిలో ఉన్న బాలల పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థి కిరణ్, పదవ తరగతి విద్యార్థి సంపత్, తనను ఏడిపిస్తూ ఉండేవారు. అప్పుడు అంకిత తన స్నేహితులు పరుగున వెళ్ళి పోయేవారు.

ఆ రోజు శనివారం అనుకోకుండా అంకిత స్నేహితులు అందరూ పాఠశాలకు సెలవు పెట్టారు. అంకిత ఒక్కర్తే పాఠశాల నుండి వస్తుంది, ఎప్పటి నుంచో తన వెంట పడుతున్న కిరణ్, సంపత్ లు అంకిత కోసం వేచి చూస్తున్నారు.

సరిగ్గా అదే సమయానికి కిరణ్, సంపత్ ల పాఠశాల త్వరగా అయిపోవడంతో అక్కడ అంకిత కోసం కాచుకొని చూస్తున్నారు.

అంకిత బయపడుతూనే  ఆ పాఠశాల వైపు వచ్చింది, ఇంటికి వెళ్ళడానికి అదే దారి మరి అంకిత రాక తప్పలేదు.

అంకిత బాలల పాఠశాల దగ్గరకు వచ్చింది, కిరణ్, సంపత్ లేకపోవడంతో మనస్సు కుదిట పరచుకుని నడుస్తుంది.

ఇంతలో తన కోసమే వేచి కూర్చున్న కిరణ్, సంపత్ ఆ చుట్టుపక్కల ఎవరు లేకపోవటం గమనించి, ప్రశాంతంగా వస్తున్న అంకిత వెనుకాతల నెమ్మదిగా వచ్చి ఒకరు అంకిత చేతులు పట్టుకోగా, మరొకరు తన నోటిని గట్టిగా మూసేసి, బాలల పాఠశాలలోని వెనుక భాగానికి తీసుకుని వెళ్ళారు.

ఇద్దరు తనను బలవంతం చేయబోతే తను వదిలించుకోవడాని శత విధాల ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు వదలలేదు, పైగా అంకిత ఎక్కడ పారిపోతుందో అని కిరణ్ అంకిత బేగ్ లోని షార్ప్ నర్  తీసి షార్ప్ నర్ కి ఉన్న బ్లేడ్ ను తీసి అంకిత మెడను కొద్దిగా కట్ చేసాడు.

తరువాత వారు తనను అనుభవించి అక్కడే వదిలేసి వెళ్ళి పోయారు.  అప్పటికే పాఠశాల సమయం పూర్తి అయి చాల సేపు అవడంతో అంకిత తల్లి తండ్రులు తనను వెతుక్కుంటూ వెళ్ళారు. ఎక్కడ కనిపించకపోవడంతో తన స్నేహితులను అడిగారు.

అప్పుడు తన స్నేహితులు అంకిత నాన్న గారుతో అంకుల్ ఈరోజు మేము పాఠశాలకు పోలేదు అని చెప్పి, కిరణ్, సంపత్ ల కోసం చెప్పింది. అలా చెప్పడంతో ఆ బాలల పాఠశాల దగ్గరకు కూడా వచ్చి వెతికారు, అలా వెతుకుతుంటే బాలల పాఠశాల వెనుకకు రాగానే అంకిత కిందపడి స్ప్రహ లేకుండా పడిఉండడం చూసి అంకిత అంటూ వెళ్ళి పట్టుకుని ఏడుస్తుంటే మెడ కోసుకొని ఉండడం చూసి ప్రక్కనే ఉన్న హాస్పటల్ కి తీసుకుని వెళ్ళారు.

వెళ్ళిన తర్వాత వైద్యం చేయగానే అంకిత అసలు నిజం చెప్పింది, వెంటనే అంకిత వాళ్ళ తల్లిదండ్రులు కిరణ్, సంపత్ లను అరెస్ట్ చేయించారు.
కానీ, సంపత్, కిరణ్ వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయిఉన్నందున పోలీసులకు డబ్బులు ఇచ్చి కిరణ్, సంపత్ ల గురించి బయటకు ఎవ్వరికీ తెలియకుండా చేసేసారు. వారం గడిచిన తర్వాత అంకిత ఆయువును విడిచింది.

బాలికలకే  భద్రత లేకుంటే మన ఈ భారతదేశంలో  జీవించేదెలా………………..????

ధనముకు లొంగిపోయే ఆఫీసర్స్ ఉండే వరకు అమ్మాయిలు జీవించేదెలా……………………?????

ఆత్మీయ బంధాలకు కొలువైన భారతదేశం, ఆడవారి ఆయువును తీసే దానవుల లోకంగా మారిపోయినది కదా……….!!!

***

You May Also Like

12 thoughts on “అంకిత అంతం

  1. ఎన్ని చర్యలు తీసుకున్నా బిహేవియరల్ చేంజ్ లేక పోతే సమాజం బాగుపడదు…చక్కటి కథాంశం అండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!