ఆవేశపు ఆశయం

ఆవేశపు ఆశయం

రచన: బండి చందు

నిశి ముసిరిన నిండు జగతికి
అతనో రవికిరణపు ఉదయం
బడిపలుకుల పలుకు బడులని
యథేచ్ఛగా వాడిన యువ గళం
ఏ గొడవా పట్టించుకోని ప్రజలచే
తన గొడవ చదివించిన చైతన్యం
బానిస సంకెళ్ళ బంధాలను తెంచి
ఉద్యమదిశగా నడిపించిన వేగుచుక్క
గతం చేసిన గాయాల బాధలను భరించి
కత్తుల నెత్తుటి రచనల చేసిన కలం
చావు పుట్టుకల నడుమన
బ్రతుకంతా తెలంగాణకే అర్పించిన సాహసం
నాయకుడివో అధికారివో
అసమాన సామాన్యుడివో
అంతరంగమందున ఆశయం
పయనమైన గమన గమ్యం
నిలువెత్తున నీలో ఉప్పొంగే ఆవేశం
అన్నింటి లక్ష్యం ఎప్పటికీ ఒక్కటేనని
ఎలుగెత్తి మరి చాటి చెప్పిన ధైర్యం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!