కట్టడి

 కట్టడి

రచయిత :: స్వప్న మేకల

నిన్న రేగిన కరోనా యుద్ధం
నేటికీ పోరు పెడుతుంటే..
అలిసి సొలిసిన దేహాలన్నీ
నిర్జీవమై నియంత్రణ బందిఖానాకి బలై..
ఊపిరి సలపని కంటి ఆవరణలో
కొట్టు మిట్టాడుతున్నాయి..!!

అలజడి దృశ్యాలన్నీ
మనసు పొరలని తాకుతుంటే
తెరిచిన తలపులకు గంతలు కట్టి
నిశ్శబ్ద పోరాటానికి అంతిమంగా
స్వాగతిద్దాం..!!

కొన్ని ఆంక్షలకు కట్టుబడి
కొన్ని విధులను నిర్వర్తించే దిశగా అడుగులు వేద్దాం..
సామాజిక దూరంతో ప్రణాళిక బద్దంగా
స్వీయ నిర్బంధంలో పరుగు పెట్టే పాదాలను కట్టడి చేద్దాం..!!
మానవత్వంతో మెలిగి ఆయువనే
ప్రాణ వాయువుతో ఊపిరిపోసి
సమాజ శ్రేయస్సుకై చేయూత నిద్దాం..
ఎవరికి వారుగా పోరాడి ఐకమత్యంగా గెలుద్దాం..దేశాన్ని గెలిపిద్దాం..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!