తెలియని పోరు

తెలియని పోరు

రచయిత:: బండి చందు

తెల్లవారితే భయమేస్తోంది
నిన్న నన్ను ఆప్యాయంగా పలకరించిన
పిలుపు మళ్ళీ వింటానో లేదో
ఇంతకు ముందే ఈ దారిలో
కలిసిన వ్యక్తిని రేపు చూస్తానో లేదో
క్షణక్షణం మరణ మృదంగం
కర్ణభేరులని కఠోరంగా తాకుతుంది
నిశ్శబ్ద యుద్ధం నిదురపోనిక నను
నిలువునా పోరుకు ఉసిగొల్పుతుంది
కాలం దూసే నెత్తుటి కత్తులను
ఏ కన్నీటితో కడగను
కంటి కొనల రౌద్రభాష్పాలను
ఏ చేతులతో తుడవను
నా అడుగులు నన్ను నిలబడనీయక
నీరెండ వైపు మొగ్గు చూపమంటున్నాయి
ఎడారి ఎండమావులు ఏ ఒయాసిస్ ను
ఏర్పాటు చేసాయో కళ్ళు చూడనంటున్నాయి
రేపటి కోసం నిన్నటితో యుద్ధం చేయాల్సిన
అవసరం అత్యవసరం అయిపోయింది..

హామీపత్రం: ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!