కవినే అక్షరానికి అమ్మ

కవినే అక్షరానికి అమ్మ

రచయిత:: చలిమేడా ప్రశాంతి

మనసులోని భావాలు అక్షర రూపం దాల్చితే
ఆ భావాలు కవితాగునో  కథగునో  లలితా కళ గా మరునో
కవి హృదయ  వాక్యాల అల్లికలు ఊహలోకాని సరికొత్త  ప్రాణాన్ని పొసే కవిభావజాలం కదా రచన లలిత కళ తోరణం.
కవి ఆలోచన పరిధిని మన కంటికి మనసుకి అతుక్కునేలా పదజాలాన్ని  మురిపించేను కదా
కవి కన్నా తొలి బిడ్డ తన భావజాలం నుండి
వాలుజారిన మొదటి కవితనే కదా
పదాలతో నాట్యమాడించే కవి  నాట్యకారుడు
అవుతాడేమో వాక్యాలకు పదనిసలు నేర్పే
సంగీత కళాకారుడుగా మారును కదా..
తనే అని కళలకు అక్షరమాలిక సోయగాన్ని
రచన లలిత తోరణంగా అలకరించగలడు.
ఆనాటి చరిత్రను ప్రపంచానికి అందించిన
వ్యక్తి  ఓ రచయిత్రే కదా
నేటి ప్రపంచాన్ని అందగా చూపించేది కవినే కదా
మూలములలో దాగిన ఘనతలు అందరికి తెలిసేలా చేసేది కవికళాకారులే కదా
అది ఇది కాదు కలం పట్టిన కవికి కవితగా మారేది ఈ సృష్టి లో లేనిది ఉంటుందా.
ఏ భావాన్ని  ఏ కథనాన్ని  రచించిన అది నిజమే అనే
ఆశాజ్యోతి వెలిగించును.
కవి ఒక అంతర్జాల ప్రచారకుడు
కవి ఒక  నూతన విశేషకారుడు.
కవి ఒక  భావోదకారుడిగా ప్రతి అక్షరానికి ప్రాణంపోసే అమ్మ అవుతాడు..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!