జీవన సమరం

జీవన సమరం.

రచయిత:: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

చావు ,పుటుక ల మధ్య మజిలీ అయిన ఈ జీవితంలో నిరంతరం పోరు తప్పని పయనం
తల్లి కడుపు నుండి బయటపడే ప్రతీ మనిషి కదనరంగంలోనే కాలు మోపుతున్నాడు
ఊహ వచ్చింది మొదలు యుద్ధానికి సిద్ధపడడం తప్పనిదే ఈ జీవితం

నిత్యమూ అవసరాలతోనో , ఆవేదనలతోనో అన్వేషణలతోనో పరిశీలనలతోనో పరుగులెడుతూ రణరంగంలో కధం తొక్కాల్సిందే

చిన్పప్పటి నుండే మొదలెట్టాలి రణము రేప్రొద్దున నింపుకోవలసిన కడుపుల తిప్పలు

బడులు,చదువులు ఉద్యోగాల వేటలు ,ఉద్యోగ మొచ్చాక పెళ్ళి, పిల్లల ,బాధ్యతలతో పోరాటంలోనే సగం జీవితం గడపాల్సి వస్తుంది

ఇక సగం జీవితంలో
సంసారంలో పిల్లల చదువులకు కొండెక్కిన స్కూలు ఫీజులను కట్కోటులేక

కడుపు నిండా తిండి తిందామంటే ఆకాసాన్నంటిన నిత్యావసరాల ధరలను అందుకోలేక

ఇంటి అద్దెలు,కరెంటు బిల్లులు కేబుల్ బిల్లులు అని నిత్యమూ సమరం సలుపుతూ అలసిపోయి

బి పి షుగర్లతో ఆయాసపడుతూ బ్రతుకున నెట్టుకొస్తుంటే

ఇవి చాలవన్నట్లు గోరుచుట్టు మీద రోకలిపోటు అన్న చందాన

మందుల్లేని రోగాలు,కంటికి కనపడని వైరస్ లు శత్రువుల్లా దాడి చేస్తుంటే

ఓడిపోయి ఈ భూమి మీదకొస్తూ ఏ కదన రంగాన ఊపిరి పోసుకున్నాడో అదే కదన రంగాన ఊపిరి వదులుతున్నాడు

ఎంత పోరాడినా ఓటమితోనే ముగుస్తుంది మనిషి యొక్క జీవనసమరం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!