త్యాగనిరతి

త్యాగనిరతి

రచన :వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

      .   ఏమే! బాబు దగ్గర నుంచి ఒక్క ఉత్తరం కానీ  ఫోను కానీ రాలేదు, నెల రోజులు అయ్యింది, కాశ్మీర్ బోర్డర్ లో ఎంత అప్రమత్తంగా పహారా కాస్తున్న ‘పాకిస్తానీ వెధవలు’ చొరబాట్లు బాగా ఎక్కువ అయ్యాయి, సరిహద్దులలో కందకాలు త్రవ్వి, మరీ భారత భూభాగంలోకి చొరబడుతున్నారు,మన కృష్ణమోహన్ కూడ తిండి తిప్పలు లేకుండా  రాత్రింబవళ్లు దేశ రక్షణ కోసం సరిహద్దులలో ఉండిపోయాడు, “అంటూ భార్య ప్రమీల తో రంగారావుగారు బాధగా చెప్తుం డే సరికి , ‘అవునండి నిజమే!  నా కొడుకు మళ్లీ ఎప్పుడు వస్తాడో ఏమో? అంటూ మిలటరీ డ్రస్ లో ఉన్న కొడుకు కృష్ణమోహన్ ఫోటోని చూస్తూ బాధగా పమిటిచెంగు తో కళ్లు తుడుచుకుంటూ  అంది ఆ తల్లి.
అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ముసలి తల్లిదండ్రులు ఆవేదన ఎక్కువైపోయింది “ప్రమీల, ఈసారి వాడు రాగానే వాడికి పెళ్లిచూపులు చూపించి నచ్చితే పెళ్లి చేసెయ్యాలి, ఈ ముసలితనంలో మనం ఉంటామో, పోతామో,? వాడిని చూసుకోవడానికి ఎవరో ఒకరు తోడు కావాలి కదా! అనగానే భార్య ప్రమీల హుషారుగా లేచి ‘నా మనసులోని మాట చెప్పారు, మా చుట్టాల్లో అందమైన చదువుకున్న అమ్మాయిల తల్లిదండ్రులు ప్రతిసారి ఫోన్  చేసి సంబంధాలు కలుపుకోమని గొడవ చేస్తున్నారు, మన కృష్ణ మోహన్ కి నచ్చిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా పెళ్లి చేసేద్దాం, అండి అనేసరికి, రంగారావు గారు కూడా ,వాడు రానీ అన్ని చెప్దాము, మన మాట ఎప్పుడూ కాదనలేదు నా పిచ్చి తండ్రి ,అంటూ కొడుకు మీద అమితమైన ప్రేమ తో నవ్వుతూ అన్నారు.
ఆ రోజు ‘టీవీలో ‘సరిహద్దులలోని చొరబాట్లు గురించి అక్కడ విశేషాలు చెప్తుంటే, ఆసక్తిగా చూస్తున్నారు రంగారావుగారు, అంతలోనే ఇంట్లోనే ల్యాండ్ లైన్ ఫోన్ రింగవుతున్న వినిపించక పోవడం వలన ఆయన తీయకపోవడం చూసి పరుగెత్తుకుంటూ వచ్చి” ఏమండీ, ఫోన్ మోగుతుంది ,మీకు వినిపించడం పూర్తిగా పోయింది, అంటూ విసుక్కుంటూ ప్రమీల గారు ఫోన్ తీసి హలో అనగానే కొడుకు’ కృష్ణమోహన్ ‘ ‘అమ్మా బాగున్నావా! అన్న మాటలు ఆవిడ  చెవిలో అమృతం పోసినట్లయి ఆనందంతో,’బాబు నువ్వు బాగున్నావా నాన్న, ఎన్నాళ్ళయింది రా! నీ మాటలు విని, ఉండు నాన్నగారిని పిలుస్తాను నీకోసం తహతహలాడుతున్నారు, ఏవండీ! మన అబ్బాయి లైన్ లో ఉన్నాడు త్వరగా రండి, అంటూ గట్టిగా అరిచే సరికి ఆయన కూడా ఆతృతగా వచ్చి’ ఏరా బాబు ఎలా ఉన్నావ్ ?అంటూ కుశల ప్రశ్నలు వేశారు.
‘ ఏం లేదు నాన్నగారు, నేను వస్తున్నప్పుడు నాతోపాటు  నా స్నేహితుడు మురళి ని తీసుకు వస్తాను ఆయన కూడా మనతోపాటే ఉంటాడు, ఎందుకంటే మురళికి బుల్లెట్లు తగిలి ఒక కాలు చెయ్యి కొన్ని నెలలపాటు పనిచేయవు, వాడికి తల్లిదండ్రులు లేరు అని చెబుతున్న సమయంలో రంగారావు గారికి ప్రమీల గారికి నోట మాట రాలేదు, మీరేమంటారు అని కనుక్కుందామని ఫోన్ చేశాను అనగానే’ అయ్యో పాపం! అది ఎలా జరిగింది? సరే నాన్న! నీతో పాటు తీసుకురా, మనం కూడా అన్ని విధాల జాగ్రత్తగా చూసుకుందాము, మళ్లీ నీ సెలవులు అయిపోయాక నీతో పాటే తీసుకువెళ్ళు , మీ ఇద్దరూ తప్పకుండా రండి అన్న తండ్రి మాట వినగానే, లేదు నాన్న మురళి ఇంకా కోలుకోవడం కష్టమే జీవితాంతం మనతోపాటే ఉండాలి ఎందుకంటే డాక్టర్లు చెప్పిన విషయం మురళి కి రెండు నెలల్లో కోలుకుంటే మళ్లీ ఆర్మీ లోకి రావచ్చు ,లేదా జీవితాంతం అవిటి వాడిగా పెన్షన్ తీసుకుంటూ ఇంట్లోనే ఉండాలి, అందువలన మీ ఉదేశ్యం అడుగుతున్నాను అనేసరికి ఖంగుతిన్నట్టు అయ్యింది రంగారావు గారికి, ఉండు నాన్నా అమ్మ తో కూడా మాట్లాడి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, అని ఫోన్ పెట్టేశారు.
కాసేపటి తర్వాత రంగయ్య గారు కొడుకు కి ఫోన్ చేసి ‘బాబు ,నువ్వు చెప్పింది బాగుంది, నీ స్నేహితు డు ను తీసుకురా కానీ నువ్వు వెళుతున్నప్పుడు నీతో తీసుకెళ్ళు, ఎందుకంటే నువ్వు లేకుండా మేము అతనికి సేవ చేసే పరిస్థితిలో లేము, అమ్మ పరిస్థితి ఏంటంటే కూర్చుంటే లేవలేదు ,లేస్తే కూర్చోలేదు అన్నీ నేను దగ్గరుండి సాయం చేస్తేనే ఆరోజు గడుస్తుంది,నాకు సరిగ్గా కనబడడం మానేసింది, ఈ పరిస్థితులు నీ స్నేహితుడు కి కావలసిన సహాయం చెయ్యలేము, ఏమీ అనుకోకు, అందుకే నువ్వు వస్తే ఈసారి మంచి పిల్లను చూసి పెళ్లి చేసి కోడలు అండదండలతో బతుకు సాగిద్దాం అనుకున్నాము, ఇది అసలు పరిస్థితి, అని బాధగా నాన్నగారి చెప్పేసరికి ‘అరెరే,, అలాగే నాన్న మీరు జాగ్రత్త, నేను తొందర్లోనే వస్తాను నా స్నేహితుడికి నేను సాయం చేస్తాను, ఉంటాను అని ఫోన్ పెట్టేసాడు కృష్ణ మోహన్.
హాస్పిటల్లో మంచం మీద పడుకొని తనకే బుల్లెట్లు గాయంతో ఉన్నానని తెలిస్తే ఆ ముసలి వయసులో అమ్మానాన్న బెంగతో చచ్చిపోతారు, అన్న ఆలోచనతోనే తన స్నేహితుని గురించి చెప్పి చూశాడు, కానీ అక్కడి పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో తన నిర్ణయాన్ని మార్చుకుని ఒక్కడే బాధపడుతూ రెండు నెలలపాటు మంచం మీదే ఉండిపోయాడు కృష్ణమోహన్.
అలాగే రెండు నెలలు ఆపరేషన్ చేసిన తర్వాత మంచిగా కోలుకొని ఆనందంతో ఇక ఇంటికి వెళ్లొచ్చు అనుకుంటున్న తరుణంలో ఫిట్నెస్ పూర్తిగా ఉన్న సైనికులను అత్యవసర డ్యూటీలకు హాజరు కావాల్సిందేనని ఆర్డర్స్ రావడంతో మళ్ళీ తన విధినిర్వహణలో సరిహద్దుల వైపు 40 మంది శిక్షణ పొంది ఉన్న నిపుణులను ఏం చారు అందులో కృష్ణమోహన్ ఒకడు, ఇక తప్పని పరిస్థితుల్లో ఒక పెద్ద అ మిలటరీ కాన్వాయ్ బయలుదేరింది అందులో అందరూ కూర్చున్నాక శ్రీనగర్ దారిలో వెళుతుండగా అనుకోకుండా ఉగ్రవాదులు పెట్టిన ల్యాండ్ మైన్స్ పేలి కృష్ణ మోహన్ కూర్చున్న ట్రక్కు కూడా తునాతునకలు అయిపోయింది అందులో ఉన్న ప్రతి ఒక్కరూ వీర మరణం పొందారు ఈ వార్త భారతదేశాన్ని అతలాకుతలం చేసింది ఎలాగైనా పాకిస్తాన్ ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం రహస్యంగా ఒక ప్లాన్ ప్రకారం సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ఆయుధం డిపోలను నాశనం చేసింది అది భారతదేశపు అఖండ విజయం.
కృష్ణ మోహన్ పార్థివ దేహాన్ని ప్రభుత్వ లాంఛనాలతో తల్లిదండ్రుల సమక్షాన అత్యంత గౌరవంగా దహనం చేశారు.
రంగయ్య గారు వారి భార్య ప్రమీల గారిని రాష్ట్రపతి గారి ఆహ్వానం మేరకు ఢిల్లీ, పిలిపించి అమితమైన సానుభూతిని ప్రకటించి, కృష్ణ మోహన్  ఒక వీరోచిత సైనికుడు, రెండు నెలల కిందట సరిహద్దు పోరాటంలో వీరోచితంగా పోరాడి తన కాలు చెయ్యి పోయిన, మళ్లీ హాస్పిటల్ లో ఉండి బాగా అయిన తర్వాత తన దేశం కోసం అత్యవసర పరిస్థితులలో సెలవు కూడా తీసుకోకుండా మళ్లీ యుద్ధభూమికి వెళ్తున్న తరుణంలో ఈ దుర్ఘటన జరిగి అసువులు కోల్పోయాడు, అతని పోరాట పటిమకు, నిస్వార్థ సేవకు భారతదేశ ప్రభుత్వం ఎంతో రుణపడి ఉంది ,అన్న  ప్రసంగం విన్న కృష్ణమోహన్ తల్లిదండ్రులు ఒకింత ఆశ్చర్యపోతూ, ప్రమీల నిజంగా మనవాడు దెబ్బ తగిలింది తన స్నేహితుడు అని చెప్పి అబద్ధం ఆడే డు, మన పరిస్థితులు తెలుసుకుని మనం సేవ చేయలేమో! అనుకొని ఒక్కడే బాధపడుతూ హాస్పటల్ లోనే ఉండి పోయాడు,అయ్యో ఎంత పని చేసమే, నిజంగా అలాంటి కొడుకుని కన్నందుకు మనము ధన్యులము, అనుకుంటూ బాధపడుతూనే ” రాష్ట్రపతి “గారి చేతుల మీదగా బిరుదు ప్రధానం, జీవితాంతం అతని తల్లితండ్రులకు ‘ పెన్షన్’ వచ్చేటట్టు ఇచ్చిన పత్రాలు, తీసుకొని భారమైన హృదయంతో  కొడుకుని తలుచకొంటు “ఒసే ప్రమీల, మనకి ఇంకో ఇద్దరూ పిల్లలు ఉంటే బాగుండును,వారిని కూడా భారత దేశపు యుద్ద పౌరులుగా మన దేశ రక్షణకు పంపిస్తాను” అంటూ భార్య భుజం మీద చేయి వేసి మెల్లిగా నడిపించుకుంటూ కొడుకు కృష్ణమోహన్ జ్ఞాపకాలతో వెళ్లిపోయారు.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!