ఇంకెప్పుడు

ఇంకెప్పుడు

రచయిత :: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ )

ఏడ్చి ఏడ్చి తడిలేని కన్నుల్లో
సంతోష మెరుపు కనపడేది ఎప్పుడో

బాధపడి బరువెక్కిన హృదయాలకు
స్వాంతన చేకూరేది ఎప్పుడో

అలసి సొలసిన బ్రతుకులలో
సంతోష వెలుగులు నిండేది ఎప్పుడో

వేదనతో కృంగిపోయే మనసులకు
ఆహ్లాదాన్ని అందించేది ఎప్పుడో

సంతోష అన్వేషణలో నిలిచిపోయిన అడుగుల
ప్రయాణం మళ్ళీ ప్రారంభమయ్యేది ఎప్పుడో

అపార్థాలతో విడిపోయిన బంధాలలో
ప్రేమ అనురాగాలు మొదలయ్యేది ఎప్పుడో

ఆలోచనల్లోనే బంధించిన ఆవిష్కరణల
నవశకం మొదలయ్యేది ఎప్పుడో

కలలుగా మిగిలిపోయిన ఆశయాలు
ప్రగతి బాటలో పయనించేది ఎప్పుడో

అజ్ఞానుల పాలనలో నలిగిపోతున్న దేశానికి
నిజమైన స్వాతంత్య్రం వచ్చేది ఎప్పుడో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!