మదిలో మెదిలే కోరిక

మదిలో మెదిలే కోరిక

రచయిత :: సావిత్రి కోవూరు

చిరు నవ్వుల చిట్టి పాపలా  మనసారా నవ్వాలని, మదిలో చింతలు మరవాలని,

గల గల పారే సెలయేరులా గట్లు చెట్లు
దాటాలని, గంతు లేస్తూ పరిగెత్తాలని,

జల జల పారే జలపాతంలో జలకాలెన్నో ఆడాలని,
జగమును మరచి పోవాలని,

పచ్చపచ్చని పచ్చిక పైన పవ్వళించాలని, పరవశించి పోవాలని,

గగనతలంలో పక్షుల్లాగా పైపైకి ఎగరాలని, జగములన్ని చుట్టెయ్యాలని,

పింఛము విప్పి నాట్యం చేసే నెమలిలా నాట్యాలెన్నో చేయాలని, నటనలు ఎన్నో చూపాలని,

పచ్చపచ్చని చిలక ల్లాగా ముద్దుముద్దుగా పలకాలని, ముచ్చట్లెన్నో చెప్పాలని,

చల్ల చల్లని పవనం లాగా ప్రపంచాన్నే చుట్టేయాలని, వింత లెన్నో చూడాలని,

ప్రభాత కాంతుల సూర్యోదయమును పరికించి చూడాలని, పరవశమే పొందాలని,

సాయం సంధ్య శశికిరణాల తనివితీరగ కాంచాలని, తన్మయమే పొందాలని,

నింగిని నీలి మబ్బుతెరలతో ముచ్చట తీరా ఆడాలని, మురిపాలు ఎన్నో చెప్పాలని,

తళతళలాడే తారలు గూర్చి తలలో మాలగ తురుమాలని,మురిసి మురిసి పోవాలని,

మిల మిల మెరిసే చందమామతో ముచ్చట్లెన్నో చెప్పాలని, మైమరచి పోవాలని,

తెల్లని చల్లని వెన్నెల్లోనా మునిగి పోయి
ఆడుకోవాలని, పాటలు ఎన్నో పాడాలని,

మదిలో మెదిలే నా కోరిక లే, తీరున లేదో ఎరుగను నేను,

మదిలో పదిలం చేసేను తలచి తలచి మరి మురిసేను.

You May Also Like

One thought on “మదిలో మెదిలే కోరిక

  1. చిన్ని చిన్ని ఆశ…ఆశలు👌👌💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!