ఎదురు చూపు

ఎదురు చూపు

రచన: దుర్గా మహాలక్ష్మి ఓలేటి

తొలి పొద్దు గగన సీమ
జగతిని మేలుకొలుపు భానుడి
నులి వెచ్చని కిరణాల వేదిక…

తొలి జాము కోడి కూత
పెనిమిటితో చిరు కోపతాపలకు సూచిక నూతన జీవన గమనానికి
నాంది యేగా
పచ్చని పేడ కళ్ళాపి ముంగిళ్లు
ముగ్గులతో మురిసే చూడగా
మట్టి పొయ్యిపై మత్తెక్కించే పాల పొంగుల రుచులకు ఆహ్వానం పలుకుగా …

ప్రకృతి చెలి పల్లెటూరి భామామణి
పచ్చని రైకా ఎర్రని కోక కుచ్చిళ్ళు
గుంభనంగా కచ్చా పోసి చీర కొంగు
నెల వంక నడుము సాక్షిగా
అపురూప నాభికి జత కూర్చగా

కొప్పున ఎర్రని మందారం
సిగ్గుదేలిన చెక్కిలి ఆధరాలు విరిసే…
నుదుటన సింధూరం
మదిలోగుసగుసలాడే
పరువాల ప్రాయానికి
వయ్యారి వరికంకులు
పైర గట్ల జతగా పరవశించి నవ్వే…

మండే సూర్యుడు మనసు జారి
మంత్ర ముగ్ధుడైన ప్రణయ తాపాన్ని
పడమటి గుమ్మాన
ప్రేమ తోరణం చేసి పడుచుదాని
అందాల పొందుకై వలపుల తలపుల్లో
తడిసి తడిసి…..
మది తలుపులు తెరచి
వాలు చూపుల బిగి కౌగిలిలో
కుసుమ కోమలాంగి పొందుకై
విలవిలలాడే రవి కాంతుడు

జాజి సొగసుల గాజుల గలగలలు
అగరు పొగలతో చెలరేగిన సెగలతో
గూడుకట్టుకున్న గుండె గూటిలో
ఊహకందని ఉసులతో సందే పొద్దు సూరీడు
సంధ్య వేళ వేచి చూసే చల్లని జాబిలి రాక కై
తనివి తీరా ఆస్వాదించే అందాల విందుకై ఏకాంత వాసాన కాంత దాసుడై…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!